భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకున్న ఆస్థిని స్వచ్చందంగా వెల్లడించారు. గ్రామా స్థాయిలో సర్పంచ్ , ఎంపిటిలుగా పనిచేస్తున్న వారికే కోట్లు కూడబెడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులుగా ఉన్నవారు లక్షల కోట్లు ఉన్నవారు ఎక్కువమంది ఉన్నారు.

ఈ సంవత్సరం
ఈసంవత్సరం మార్చ్ 31 కి ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించిన అయన ఆస్థి పరిశీలిస్తే రూ.2 .28 కోట్లు మాత్రమే. ఇక ఇందులో క్యాష్ రూపంలో ఉంది కేవలం రూ.50 లక్షలు కాగా మిగతాది కోటి రూపాయల దాకా ఫిక్సడ్ డిపాజిట్ ఉన్నాయి.

గాంధీ నగర్లో
ఇక అయన ధరించే బంగారు ఉంగరం విలువ రూ.1 లక్ష రూపాయలు వరకు ఉంటాయి. మరో రెండు లక్షల వరకు పెట్టుబడులు ఉన్నాయి.ఇక ఈయనకి గాంధీ నగర్లో ఒక స్థలం కూడా ఉంది. 2002 లో ఈ స్థలాన్ని రూ.1.30 వేలకు కొన్నారు.

కోటి రూపాయలు
ఇక ఆయనకు వారసత్వం తో వచ్చిన ఒక బంగ్లా కూడా ఉంది.దీని విలువ ఒక కోటి రూపాయలు వరకు ఉండచ్చు. అయితే అందులో అయన భాగం నాల్గవ వంతు మాత్రమే .ఇక మన దేశ ప్రధాన మంత్రి మోడీకి సొంత కార్లు. బైకులు కాని లేవు .

బంధువులు
ఈరోజుల్లో క్రింద స్థాయి ప్రజా నాయకులే కోట్లకి పడగలెత్తుతున్నారు అలాంటిది మన దేశ ప్రధాన మంత్రిగా ఉండి అయన ఆస్థి మొత్తం కేవలం రూ.2 .28 కోట్లు కావడం విశేషం.ఇక మనకి తెలిసిన వారు లేదా మన చుట్టం రాజకీయాలలో ఉంటే మనం కూడా ఏదో ఒక పని కోసం వారి దగ్గరకి వెళ్తాము కానీ మోడీ బంధువులు ఏమి చేస్తున్నారో వారి ఆస్తులు ఎంతో చూద్దామా?

దేశ ప్రధాని
దేశ ప్రధాని అబ్బో దేశానికి ప్రధాని అయితే వారి కుటుంబ సభ్యులు రాజా భోగాలు అనుభవిస్తుంటారు. ఇది అందరు అనుకొనే భావన. ఇది ఇప్పటినుంచి అంతా అనుకోనిది కాదు ఎప్పటినుంచో ప్రతిఒక్కరి భావన కూడా ఇదే.

ఛాయ్ వాలా
కానీ ప్రస్తుతం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబసభ్యులు మరియు అయన బంధువుల గురించి తెలిస్తే మనమందరం ముక్కున వేలు వేసుకోవలసిందే. ఛాయ్ వాలా ప్రధాని అంటూ బీజేపీ నాయకులు ఎప్పుడు గొప్పగా చెబుతుంటారు. ఆ ఛాయ్ వాలా కుటుంబసభ్యులు ప్రస్తుతం అదే ధోరణిలో కొనసాగుతున్నారు తప్ప ప్రధాన మంత్రి తమ వాడే అంటే అసలు పట్టించ్చుకోరు.

సోంబాయి
సోంబాయి మోడీ గారి పెద్దన్న ఈయన వయస్సు 75 సంత్సరాలు ఈయన పూణేలో ఒక వృధా ఆశ్రమం నడుపుతున్నారు.

రెండో అన్న
ఈయన నరేంద్ర మోడీ రెండో అన్న ఈయన వయస్సు 72 సంత్సరాలు ఈయన అహమ్మదాబాద్ గీత మందిర్ వద్ద రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో టీ దుకాణం నడుపుతున్నారు.

మరో సోదరుడు
ఈయన నరేంద్ర మోడీ గారి మరో సోదరుడు ఈయన వృత్తి ఉపాధ్యాయుడు ఈయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు. ఈయన తన కూతురును ఒక బస్సు కండెక్టర్ కి ఇచ్చి వివాహం చేసాడు.

బాబాయ్ కొడుకు
ఇక అరవింద్ భాయ్ నరేంద్ర మోడీ గారి బాబాయ్ కొడుకు ఈయన నూనె డబ్బాలు మరియు పనికి రాని వస్తువులను అమ్మి నెలకి రూ.9 వేలు సంపాదించేవాడు. ఇక అతని కుమారుడు గాలి పటాలు, చిన్న చిరు తిండ్లు తయారు చేసి అమ్ముకుంటూ వర్డ్ నగర్లో ఒక చిన్న గదిలో ఉంటున్నాడు. వర్ద్ నగర్లో ఎవరికీ వీరు ప్రధాని నరేంద్ర మోడీ గారి బంధువులు అని తెలియదు.

డబ్బు సంపాదించే
అధికార మదంతో వందల వేల కోట్ల డబ్బు సంపాదించే వారికీ మన దేశ ప్రధాని మోడీ గారి జీవితం ఒక ఆదర్శనీయం. అయన ఆదర్శాన్ని జీవిత మార్గంగా ఎంచుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. భారత జాతి బాగుపడుతుంది రాజకీయ సంస్థ మెరుగు పడుతుంది.

మోడీ
ఎప్పుడు మోడీ గారిని విమర్శించే ప్రతిపక్షాలను అయన కుటుంబసభ్యులు మాత్రం వారిని ఎందుకు విమర్శించారు దానికి కారణం ఇదే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కానీ రోజురోజుకి దేశంలో ఇప్పుడు మోడీ మీద అయన పరిపాలన మీద మొత్తం దేశం అంతా వ్యతిరేకత వస్తున్నాయి. చూడాలి ప్రజలు మళ్ళీ మోడీ కావాలి అంటారో లేక కొత్త పరిపాలనకు పట్టం కడతారో చూడాలి.

ఉరికే వచ్చింది ఉరికే పోతుంది
ఏదిఏమైనా ఒక ప్రధాని కుటుంబసభ్యులు ఇలా ఉండడం వారి జీవనశైలి చూసి అందరు నేర్చుకోవాలి మన కష్టమే మనకు రక్షా ఉరికే వచ్చింది ఉరికే పోతుంది అని అందరు గుర్తుపెట్టువాలి .
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications