తెలంగాణ ప్రభుత్వం శాసన సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన విషయం విదితమే.డిసెంబర్ లో ఎన్నికల తేదీ నగారా మోగడంతో తెంలంగాణ రాష్ట్రము మొత్తం ఎన్నికల రణరంగం తలపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం శాసన సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన విషయం విదితమే.డిసెంబర్ లో ఎన్నికల తేదీ నగారా మోగడంతో తెంలంగాణ రాష్ట్రము మొత్తం ఎన్నికల రణరంగం తలపిస్తోంది.అధికార విపక్ష పార్టీలు తమదైన శైలిలో ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇరు పార్టీలు:
ఇటీవలే రద్దు చేసిన తెరాస పార్టీ మరియు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి.ప్రస్తుతం తెలంగాణ లో ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మద్యే నెలకొంది.ముందస్తు ఎన్నికల్లో భాగంగా కెసిఆర్ ఎవరు ఊహించని విదంగా వంద కు పైగా అభ్యర్థులను ప్రకటించాడు.

టీఆర్ఎస్ మేనిఫెస్టో:
టీఆర్ఎస్ పార్టీ నిన్న తన మేనిఫెస్టో విడుదల చేసింది ఇందులో ప్రజలకు పలు హామీలు గుప్పించారు.ఇందులో మొదటి ప్రాధాన్యం రైతులు అని ప్రస్తావించారు.తెలంగాణాలో రైతులు అనేకమంది వలసలు పోతున్నారని వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అలాగే ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోని అన్ని విధాలా కాపాడుతామని హామీ ఇచ్చారు.

రైతు రుణ మాఫీ:
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇక కాలంలో రూ.1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కెసిఆర్ ప్రకటించాడు అదేవిదంగా పంటలకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులు ప్రబుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు.

24 గంటల కరెంట్:
తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక మొదటిసారి రైతులకు 24 గంటల విద్యుత్ అందుతోందని వెల్లడించారు అంతేకాక దేశంలోనే రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి అధిక మొత్తం చెల్లించి విద్యుత్ కొనుగోలు ఎందుకు చేసారు ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని దుయ్యబట్టారు.

రైతు బందు పథకం:
రైతు బంధు పథకం ఎంతో అద్భుతమైనది కెసిఆర్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి మద్దతు లభిస్తోందని అశోక్ అలానే స్వామినాథన్ వంటి వ్యవసాయ శాస్త్రవేత్తల నుండి కూడా మన్ననలు పొందిందన్నారు.ఈ పథకం వలన రైతులకు సంవత్సరానికి రెండు పంటలకు ప్రభుత్వమే మొత్తం పెట్టుబడి సహాయం అందిస్తుంది.

రైతు బీమా పథకం:
తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుత పథకం రైతు బీమా పథకం అన్నారు,ఈ పథకం ద్వారా రైతు చనిపోతే కుటుంబసబ్యలకు రూ.5 లక్షల రూపాయలు అందిస్తుంది ఇందులో రైతుకు ఒక సంతానం ఉన్నాకూడా ఆర్థిక సహాయం లో ఎటువంటి మార్పు ఉండదని వెల్లడించారు.ప్రస్తుతం ఇప్పటిదాకా రెండు వేల మందికి ఈ పథకం ద్వారా సహాయం అందిందని పేర్కొన్నారు.

గిట్టుబాటు ధరలు:
రైతు రాజు కావాలంటే వ్యవసాయం చేస్తే సరిపోదు అని వారు పాడించిన పంటకు గిట్టుబాటు ధర లభించినపుడే రైతు రాజవుతాడని అన్నారు.గుట్టు బాటు ధర లభించి రైతు ఆర్థిక సమస్యల నుండి బయట పడి తమ పంటకు తామే స్వయంగా పెట్టుబడి పెట్టే స్థాయికి తెచ్చేవరకు టీఆర్ఎస్ ప్రబుత్వం వారికి అండగా ఉంటుందని అన్నారు.

మహిళా గ్రూపులు:
మహిళా గ్రూపులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రకటించారు,రాష్ట్రము లో మహిళా గ్రూపులు చాల చక్కగా పనిచేస్తున్నాయని బ్యాంకర్లు మొత్తం సంతృప్తి వ్యక్తం చేసారని అన్నారు.ఋణం తీసుకున్న మహిళలు 99 శాతం కంటే పైగా తిరిగి చెలిస్తున్నారని అన్నారు.వీళ్లకు ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం:
ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తూ తమ మ్యానిఫెస్టోను టీఆర్ఎస్ ప్రభుత్వం కాపీ కొట్టిందని వ్యాఖ్యానించారు.అన్ని తమ మానిఫెస్టోలో ఏమున్నాయో అవే తిరిగి చెప్తున్నారని కొత్తగా ప్రజలకు ఇచ్చిందేమి లేదని రాష్ట్ర PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

మహిళా సంఘాలకు:
మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం..వడ్డీ భారం ప్రభుత్వానిదే ఇది ప్రభుత్వ ప్రకటన అనుకోకండి..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మేరకు ఆర్ధిక సాయం అందిస్తామని తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

సంక్షేమ పథకాలు:
సంక్షేమ పథకాలు డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అనేక వరాలు కురిపించారు.

కాంగ్రెస్ పార్టీ వరాలు ఇవే:
- తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ప్రతి మనిషికి నెలకు 7 కిలోల సన్నబియ్యం.
- సన్న బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చక్కెర సహా 9 రకాల వస్తువులు.
- మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం..వడ్డీ భారం ప్రభుత్వానిదే.
- వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు.
- దివ్యాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్ .
- ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటన
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications