తెలుగు రాష్ట్రాలపై ఐటీ శాఖ పంజా విసిరింది. గురువారం నుంచి ఇప్పటివరకూ ఐటీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28చోట్ల తనిఖీలు నిర్వహించారు.

ఐటీ శాఖ దాడులు
గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు హైదరాబాద్‌లో కూడా ఐటీ శాఖ దాడులు జరిగాయి. వీఎస్ లాజిస్టిక్స్, స్వగృహ, సదరన్ కన్‌స్ట్రక్షన్స్‌తో సహా పలు కంపెనీల్లో ఈ దాడులు జరిపినట్లు సమాచారం.

పెట్టుబడుల అంశాలను
అక్రమ లావాదేవీలు, అవినీతి వ్యవహారాలు, సూట్‌కేస్ కంపెనీలు, పెట్టుబడుల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ దాడులను నిర్వహించినట్లు తెలిసింది. పలు సంస్థలకు సంబంధించిన యాజమాన్యాల పెద్దలను ఐటీ ప్రశ్నించింది. ఈరోజు సాయంత్రం వరకూ ఐటీ దాడులు కొనసాగే అవకాశమున్నట్లు తెలిసింది.

బెంజిసర్కిల్
అయితే ఈ ఐటీ దాడుల వెనుక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ దాడుల గురించి మీడియాకు ప్రత్యక్షంగా సమాచారం అందటంతో అధికారులు ప్లాన్ బీని అమలు చేశారు. మొదట బెంజిసర్కిల్‌లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం అక్కడ మీడియా ఉండటంతో అక్కడి నుంచి బందర్ రోడ్డుకు వెళ్లిపోయారు. తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెప్పారు.

టీడీపీ నేతలు
జగ్గయ్యపేట దగ్గరలోని ప్రీకాస్ట్ ఇటుకల పరిశ్రమపై ఐటీ దాడులు చేసింది. మీడియా ఉండటంతో ప్లాన్ ఏ అమలు చేయలేకపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు బృందాలు వెనక్కి తిరిగి వచ్చాయని టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది.

చంద్రబాబు
రెండుమూడు రోజుల్లో టీడీపీ నేతలు, అనుచరులకు చెందిన ఆస్తులు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతాయని అధికార పార్టీకి సమాచారం అందడంతో నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు.

నారాయణ
ఇప్పటికీ కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరగడం, నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

మోదీ
మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు.

ఎమ్మెల్యే పోతుల రామారావు
ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో కూడా ఐటీ దాడులు కలకలం రేపాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం కంటెంట్ ఫ్రొం ఏబిఎన్.


Click it and Unblock the Notifications