అనిల్ అంబానీ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ధీరూబాయ్ అంబానీ వారసుడిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. కానీ ఇప్పుడు అనిల్ అంబానీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. మొదట్లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ ముంబై మెట్రో, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ నావల్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి వంటి భిన్న రంగాల్లో లాభాలను అర్జించిన అనిల్ కంపెనీలు ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కేవలం ఆర్‌కామ్ రుణ భారమే రూ.47,000 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది.

అయితే ఈ అప్పులను ఎగొట్టడానికి అనీల్ అంబానీ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎరిక్‌సన్ అనే కంపనీ ఆరోపిస్తోంది. అనీల్ అంబానీతో పాటు ఆర్కామ్ కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను దేశం వదిలిపెట్టి పారిపోకుండా చూడాలని ఈ స్వీడిష్ టెలికాం కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కంపనీకి అనీల్ అంబానీ రూ. 1600 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో ఎరిక్ సన్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య కోర్టు మధ్యవర్తిత్వం వహించడంతో తమ మకాయిల మొత్తాన్ని ఎరిక్ సన్ రూ.550 కోట్లకు తగ్గించుకుంది. అయితే ఈ మొత్తాన్ని సెప్టెంబర్ 30 వరకు చెల్లించాలని ఒప్పందం కుదిరింది. అయితే ఈ సమయం ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంతో ఎరిక్‌సన్ సంస్థ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనీల్ అంబానీ దేశాన్ని వదిలిపెట్టకుండా చూడాలని కోర్టును కోరింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications