వినియోగదారులకి SBI నుంచి మరో షాక్! ఈ నెల ఆఖరి లోపు...
ఇప్పటికే మినిమం బ్యాలన్స్, పెనాల్టీతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తాజాగా మరో నిర్ణయం తీసుకొంది అది ఏంటో తెలుసా? ఇప్పటి వరకు రోజుకు ఏటియం కార్డు నుంచి గరిష్ట విత్ డ్రా పరిమితి రూ.40000 వరకు ఉంది.

రోజుకి
రోజుకి కొంతమందికి ఈ గనిష్ఠ విత్ డ్రా పరిమితి తక్కువ అనుకుంటుంటే ఇప్పుడు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వినియోగదారులకి పెద్ద రాయి వేసింది. ఇప్పుడు SBI అకౌంట్ ఉన్నవారు రోజుకు రూ.20 000 మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.

అక్టోబర్ 31
ఈ నిర్ణయం అక్టోబర్ 31 నుండి అమలు లోకి వస్తుంది అని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది. డిజిటల్ లావాదేవీలు పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఉన్నత అధికారులు తెలిపారు. ఏటియంలు దగ్గర నగదు విత్ డ్రా చేసుకొనే సమయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అని పిర్యాదులు వస్తుండడంతో కూడా తాజా నిర్ణయానికి కారణం అన్నారు.

నిబంధనల ప్రకారం
బ్యాంకు నిబంధనల ప్రకారం క్యాష్ విత్ డ్రా లో మార్పులు చేస్తే ౩౦ రోజుల ముందర కస్టమర్ లకి తెలియచేయాలి ఉంటుంది అని అన్నారు. ఈ విషయం ఇప్పటికే అన్ని బ్యాంకు బ్రాంచ్ లకి సమాచారం ఇచ్చాము అని బ్యాంకు ఉన్నత అధికారులు వెల్లండించారు.

దరఖాస్తు
రూ.20 ,000 కన్నా ఎక్కువ విత్ డ్రా చేసుకోవాలి అంటే అందుకు అనువైన కార్డు కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలిసి ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో ఎమ్మో చూడాలి. రోజురోజుకి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పై ప్రజలకి నమ్మకం పోతోంది.మీకు SBI ATM ఉంటె మీరు ఖచ్చింతంగా తెలుసుకోవలసిన 12 సూత్రాలు ఇవే.


Click it and Unblock the Notifications