సుమారు రెండు రోజులు పాటు రేవంత్ రెడ్డి ఇంట్లో IT సోదాలు చేసిన అధికారులు 150 ప్రశ్నలు అడిగారు అలాగే మూడు సూటుకేసుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
సుమారు రెండు రోజులు పాటు రేవంత్ రెడ్డి ఇంట్లో IT సోదాలు చేసిన అధికారులు 150 ప్రశ్నలు అడిగారు అలాగే మూడు సూటుకేసుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.అతని బంధువుల ఇండ్లలో కూడా ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.

సుదీర్ఘ సోదాలు
అధికారులు సుదీర్ఘ సోదాలు మరియు ప్రశ్నల అనంతరం రేవంత్ రెడ్డిని అక్టోబర్ 3 న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.ఆరోజు విచారణ ఒక్కరోజే ముగుస్తుందా లేక రెండు మూడు రోజులు కొనసాగుండా అనేది దాని పై చర్చ మొదలైంది.

విచారణ వరకే ఉంటుందా
మరోవైపు ఇది విచారణ వరకే ఉంటుందా లేక అరెస్ట్ వరకు వెళుతుందా అనే ఉత్కంఠ ప్రతిఒక్కరిలో నెలకొంది.అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల గురించి రేవంతును ప్రశ్నించనున్నారు,వాటికి ఆయన సంతృప్తి కర సమాధానం చెప్పవలసి ఉంది.

ఎలాంటి పత్రాలు
ఐతే అధికారులు రేవంత్ నుండి ఎలాంటి పత్రాలు తీసుకెళ్లారు అనేది రేవంతుకు తెలీదు దీనికోసం ఆయన వాటన్నిటికీ సంబంధించి నకిలీ కాపీ ఒకటి తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు అలాగే ఆ డాకుమెంట్స్ కు సంబంధించి అంశాల వారీగా వివరణ ఇవ్వచ్చు లేదంటే విచారణకు కొంత సమయం కూడా అడిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

లెక్క చూపని ఆస్తుల విలువ
రేవంతుకు సంబంధించి లెక్క చూపని ఆస్తుల విలువ రూ.20 కోట్లు గుర్తించారని సమాచారం అది కూడా అతని బావమరిది పేరున ఉన్న కంపెనీకి సంబందించినవి అని తెలుస్తోంది.దీనికి సంబంధించి విచారణలో రేవంత్ రెడ్డి సంతృప్తి కర సమాధానం చెప్తే క్లీన్ చిట్ వచ్చినట్టే.

ఆస్తుల లెక్క తేలక పోతే
ఒకవేళ అక్రమ ఆస్తుల లెక్క తేలక పోతే మాత్రం ఆ మొత్తం పై 30 శతం అదనపు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.ఎలాంటి కేసులో ఎట్టి పరిస్థితుల్లో అరెస్టుకు అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

మరొక కీలకమైన అంశం
మరొక కీలకమైన అంశం హవాలా వ్యవహారం,హైదరాబాద్ లో రేవంత్ కు చెందిన నాలుగు అంతస్థుల ఇంటి అడ్రెస్స్ తో అనేక కంపెనీలు ఉనట్టుయి చెబుతున్నారు ఐతే అవన్నీ తన ఇంట్లో అద్దెకు ఉన్న వారివి అని తనకు ఎటువంటి సంబంధం లేదని రేవంత్ తేల్చేసారు అది నిజం ఐతే ఎలాంటి సమస్య ఉండదు.

అక్రమ లావాదేవీలు
కానీ ఈ డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని తేలితే మాత్రం కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది అలాగే రేవంత్ కు సంబంధించి ప్రస్తుత ఆస్తుల విలువ ఎంత అవి కొనుగోలు చేసిన సమయం లో విలువ ఎంత దానికి అంత ఆదాయం ఎలా వచ్చింది అనే లెక్కలు చూపాల్సి ఉంటుంది.

ఓటుకు నోటు కేసు
మరోవైపు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సొన్ కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివి ఆ డబ్బు ఎవరిచ్చారు అనే అంశాలకు సంబంధించి కూడా విచారణ జరగనుంది.దీనికి సంబంధించి కేసులో నిందితులు సెబాష్టియన్,ఉదయ్ సింహ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

తనపై కావాలనే కుట్ర
ఇవన్నీ ఇలా ఉండగా తనపై కావాలనే ఈ విధమైన కుట్ర జరుగుతోందని రేవంత్ వెల్లడించారు ఇంతకీ అధికారులు స్వాధీనం చేసుకున్న పాత్రలు ఏంటి నేడు విచారణలో రేవంతా పాల్గొన్న తరువాత ఏమి జరగనిది అని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications