ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారంపై అవగాహన కల్పించేందుకు రిలయెన్స్ జియోతో వాట్సప్ చేతులు కలిపింది. ఇటీవలే జియో ఫోన్లల్లో వాట్సప్ సేవలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది జియో కస్టమర్లు ఇప్పుడు తమ ఫోన్లల్లో తొలిసారిగా వాట్సప్ ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సప్ ప్లాట్‌ఫామ్‌పై వైరల్ అవుతున్న తప్పుడు వీడియోలు, సమాచారాన్ని అడ్డుకునేందుకు జియో సహకారం తీసుకుంటోంది ఆ కంపెనీ.

జియోఫోన్లల్లో వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నవారందరికీ... ఫేక్‌న్యూస్‌పై అవగాహన కల్పించే సమాచారాన్ని షేర్ చేస్తోంది వాట్సప్. ఫార్వర్డెడ్ మెసేజెస్‌లో నిజానిజాలు ఎలా తెలుసుకోవాలి? షేర్ చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని సూచిస్తోంది. మూకదాడులు, మూకహత్యలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. దీనికంతటికీ కారణం ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారం విస్తృతంగా షేర్ అవుతుండటమే. అలాంటి ప్రాంతాల్లో జియో ఫోన్లు వాడేవారి సంఖ్య ఎక్కువ కాబట్టి జియో ద్వారా జనానికి అవగాహన కల్పిస్తోంది వాట్సప్.
ఇప్పటికే వాట్సప్ ప్రింట్, రేడియో ప్రచారాల ద్వారా జనాన్ని చైతన్య పరుస్తోంది. వాట్సప్‌లో ఎక్కువగా మెసేజెస్ ఫార్వర్డ్ చేయకుండా పరిమితి కూడా విధించింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్‌తో చేతులు కలిపి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొత్త ఫీచర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications