ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ వినియోగదారుల కోసం నిత్యం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ.. దూసుకుపోతుంది. తాజాగా. మరిన్ని కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా. వాట్సాప్ గ్రూప్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసింది. దీనిప్రకారం సంబంధిత గ్రూపు అడ్మిన్.. గ్రూప్ వివరాలను ఏ సభ్యుడు ఎడిట్ చేయవచ్చో అతనికి మాత్రమే అనుమతినిస్తూ సెట్టింగ్స్‌లో మార్పులు చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. అంతేకాదు.. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.18.142లో 'రిస్ట్రిక్టడ్ గ్రూప్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ ఐకాన్‌తో పాటు.. సబ్జెక్ట్, గ్రూప్ ఇన్ఫో ఎవరు అప్‌డేట్ చేయాలో అడ్మిన్ నిర్ణయించవచ్చు.
వాట్సాప్ వెర్షన్ 2.18.84 ద్వారా స్టిక్కర్స్ ఆల్బమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు గ్రూప్‌లోని సభ్యులను అడ్మిన్ బ్లాక్ చేసేలా మరికొన్ని ఫీచర్లను వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

బ్రాడ్‌కాస్ట్ మెసేజెస్ కేటగిరీలోనూ మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. తమ అడ్రస్ బుక్‌లో లేకపోయినా, సదరు నెంబరుకు బ్రాడ్ కాస్ట్ మెసేజ్ పంపేలా మార్పులు చేయబోతోంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీడియోలను వాట్సాప్‌లోనే చూసే విధంగా యాప్‌లో మార్పులు చేసింది.
ఇక వాట్సాప్ బిజినెస్‌లో ఫిల్టర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెర్చ్ ఆప్షన్ వద్ద ఫిల్టర్ ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు ఇందులో 'అన్‌రీడ్ చాట్స్', 'గ్రూప్స్, బ్రాడ్ కాస్ట్ లిస్ట్' అనే మూడు ఎంపికలు ఉంటాయి.
ఇప్పటిదాకా ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న 'వాట్సాప్ బిజినెస్ యాప్' ఇకనుంచి ఐవోఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications