ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు శాఖ ఇటీవల మెసెంజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. మెసెంజర్ అంటే టెలికామ్ వింగ్ నుంచి వచ్చే సమాచారాన్ని ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు చేరవేసే చిన్న ఉద్యోగం అది.

అర్హత
12 సంవత్సరాల తర్వాత 62 ఖాళీలతో నోటిఫికేషన్ వేసింది ప్రభుత్వం. అర్హత ఐదో తరగతే అయినా ఏకంగా 50,000 మంది గ్రాడ్యుయేట్లు, 28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వారితో పాటు 3700 మంది పీహెచ్‌డీ హోల్డర్లు ఈ చిన్న ఉద్యోగానికి దరఖాస్తు చేశారు.

నిరుద్యోగ సమస్య
అంతేకాదు ఎంబీఏ, బీటెక్ పూర్తి చేసినవాళ్లు సైతం అప్లై చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోంది ఈ పరిస్థితి. మొత్తం 93,500 దరఖాస్తులు వస్తే అందులో 5-12 తరగతి చదివిన వారి అప్లికేషన్లు కేవలం 7,400 మాత్రమే ఉన్నాయి.

వాస్తవానికి
వాస్తవానికి సైకిల్ తొక్కడం వచ్చి ఐదో తరగతి పూర్తి చేసినవారికి నేరుగా ఉద్యోగం ఇచ్చేస్తారు. కానీ 62 పోస్టులకు ఏకంగా 93,500 మంది దరఖాస్తు చేయడంతో సెలక్షన్ టెస్ట్ పెట్టాలని పోలీసు శాఖ భావిస్తోంది.

పోలీసు బాసులు
లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథ్స్‌తో రాతపరీక్ష నిర్వహిస్తామంటున్నారు అధికారులు. క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉన్నవారు దరఖాస్తు చేయడం వల్ల డిపార్ట్‌మెంట్ పనితీరులో నాణ్యత పెరుగుతుందని అక్కడి పోలీసు బాసులు చెబుతున్నారు

చిన్న పోస్టే
చెప్పుకోవడానికి చిన్న పోస్టే అయినా ప్రభుత్వ ఉద్యోగం కావడం, నెలకు రూ.20,000 వేతనం ఇస్తుండటంతో ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏదేమైనా క్లర్కు పోస్టు కన్నా చిన్న ఉద్యోగానికి బీటెక్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చదివినవాళ్లు దరఖాస్తు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications