ఫుట్ బాల్ మెగా స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు రూ. 150 కోట్ల జరిమానా ఎందుకో తెలుసా?
పన్ను ఎగవేత కేసులో పోర్చుగ్రీస్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి భారీ జరిమానా పడింది. నాలుగేళ్ల క్రితం ఆదాయ పన్ను ఎగవేశాడనే ఆరోపణల మీద రొనాల్డో మీద కేసు నమోదైంది.

జైలుశిక్ష
మొదట ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించిన స్పెయిన్ కోర్టు, తాజాగా జైలుశిక్షను రద్దు చేస్తూ కేవలం జరిమానా మాత్రం చెల్లించాలంటూ తుదితీర్పు ఇచ్చింది.

పన్ను ఎగవేసేందుకు
పన్ను ఎగవేసేందుకు ఐర్లాండ్ వంటి దేశాల్లోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని తేలింది. 2011 నుంచి 2014 దాకా ఏడాదికి 43 మిలియన్ యూరోల (దాదాపు 345 కోట్ల రూపాయలు) ఆదాయం చూపించిన రోనాల్డో

ఆదాయం లెక్కల్లో
ఆ తర్వాత ఏడాది కేవలం 11.5 మిలియన్స యూరోల (దాదాపు 92 కోట్ల రూపాయలు) ఆదాయం మాత్రమే లెక్కల్లో చూపించాడు. దాంతో అనుమానం వచ్చిన ఆదాయ పన్ను అధికారులు విచారణ జరపగా దాదాపు 28.4 మిలియన్ యూరోల ఆదాయం లెక్కల్లో చూపించలేదని తేలింది. ఆ విషయాన్ని రోనాల్లో అంగీకరించాడు.

స్పెయిన్ అధికారులు
దాంతో అతనిపై కేసు నమోదు చేసిన స్పెయిన్ అధికారులు స్పానిష్ టాక్స్ ఆఫీస్ యూనియన్ చట్టాల ప్రకారం 28 మిలియన్ యూరోల జరిమానాతో పాటు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష పడుతుందని భావించారు.

19 మిలియన్ యూరోలు
అయితే మొదటి తప్పిదం కింద జైలు శిక్షను రద్దు చేసిన స్పెయిన్ న్యాయస్థానం 19 మిలియన్ యూరోలు (దాదాపు 151 కోట్ల రూపాయలు) చెల్లించాలని స్పష్టం చేసింది.

లియొనెల్ మెస్సీ
క్రిస్టియానో రొనాల్డో సమకాలీకుడైన అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియొనెల్ మెస్సీ కూడా రెండేళ్ళ క్రితం ట్యాక్స్ ఎగవేత ఆరోపణల కింద రెండు మిలియన్ యూరోల జరిమానా చెల్లించడం విశేషం.


Click it and Unblock the Notifications