రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధిపతి అనీల్ అంబానీకి స్పెక్ట్రం సుడిగుండం చుట్టుకుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న ఆయనకు మరో పెద్ద సమస్య మొదలయ్యింది.

బ్యాంకు హామీలలో
స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద బ్యాంకు హామీలలో రూ.774 కోట్లు చెల్లించాలని, లేనిచో లైసెన్స్ రద్దు చేస్తామని డిఒటి నోటీసులు జారీ చేసింది. ఈ నెల చివరి వరకు వీటిని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది

నోటీసులు
దీనికి సంబంధించి గత జూన్ తొలి వారంలోనే డిఒటి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జులై ప్రారంభంలోనే తాము నోటీసులు అందుకున్నామని ఆర్‌కామ్ అధికారులు తెలిపారు.

రూ.774కోట్లను
డిఒటికి సమాధానం కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీల కింద రూ.774కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అయితే టిడిశాట్ ఆదేశాల ప్రకారం బ్యాంక్ గ్యారెం టీల మొత్తాన్ని డిఒటి తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది

రిలయన్స్
బ్యాంక్ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే డిఒటికి ఎలాంటి నష్టం వాట ిల్లదని కూడా ఆర్‌కామ్ పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఎయిర్‌వేస్ విక్రయించి రుణాలు చెల్లించే పనిలోనే ఉంది. ఇంతలో ఆకంపెనీకి డిఒటి నోటీసులు జారీచేయడం మరింత కష్టాల్లోకి నెట్టేసినట్లయ్యింది.

ముఖేష్ అంబానీ
ఆర్‌కామ్‌కు ఉన్న రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు తన వైర్‌లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోకు విక్రయిస్తోంది. వైర్‌లెస ఆస్తులతో పాటు 122 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్, ఫైబర్ నెట్‌వర్క్, టెలికం టవర్లను జియోకు స్వాధీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

అనీల్ అంబానీ
దీంతో రూ.18వేల కోట్ల మేర ఆర్‌కామ్‌కు సమకూరనున్నాయి. ప్రస్తుత పరిస్థితులు, డిఒటి ఆదేశాలతో ఒక వేళ ఆర్‌కామ్ లైసెన్స్ రద్దు అయితే జియోతో జరిగిన ఒప్పందానికి విలువ లేకుండా పోతుంది. అదే జరిగితే అనీల్ అంబానీ నావ మునిగినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications