హైదరాబాద్ ఐటి హబ్‌లో కంట్రోల్‌ఎస్ సంస్థ భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ''హైదరాబాద్‌లో 100 మెగాబైట్ కెపాసిటీతో (టైర్ 4 కేటగిరీలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన) హైపర్ స్కేల్ డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం.

సిఇఒ శ్రీధర్
వచ్చే 3-6 నెలల్లో పనులు ప్రారంభించనున్నాం. పూర్తి కావడానికి 18 నెలలు పడుతుంది. ఈ డేటా సెంటర్ కోసం రూ.1,200 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాం అని కంట్రోల్‌ఎస్ సిఇఒ శ్రీధర్ పిన్నపురెడ్డి వెల్లడించారు.

రూ.300 కోట్ల
అంతేకాదు, ఈ సంస్థ హైదరాబాద్, ముంబైలో మరో రెండు చిన్నపాటి డేటా సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతోంది. ‘‘ముంబైలో లక్షా 30వేల చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 70-80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ రెండు సెంటర్లు డిసెంబర్ నాటికి పూర్తికావచ్చు. ఇందుకోసం మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతాం'' అని శ్రీధర్ చెప్పారు

అగ్రగామి
సంస్థ మొత్తంగా రూ.1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెట్టుబడుల కోసం అంతర్గత వనరుల వినియోగంతోపాటు కొంత మొత్తంలో రుణాలు కూడా సేకరించనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. టైర్-4 కేటగిరీ డేటా స్టోరేజ్ సెంటర్ల నిర్వహణలో ఆసియాలోనే తాము అగ్రగామి అని కంట్రోల్‌ఎస్ అంటోంది.

బిర్లా గ్రూపు
ప్రస్తుతం ఈ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎ్‌సబిఐ), టాటా గ్రూపు, మహీంద్రా గ్రూపు కంపెనీలు, అదానీ గ్రూపు, బిర్లా గ్రూపు కంపెనీలు, ఫెడెక్స్‌తో పాటు పలు ప్రముఖ కంపెనీలకు డేటా స్టోరేజీ సేవలందిస్తోంది.

రూ.800 కోట్ల ఆదాయం
ప్రస్తుతఆర్థిక సంవత్సరంలో కంట్రోల్‌ఎస్ స్థూల ఆదాయం రూ.500 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. తాము క్లౌడ్4సి పేరుతో 20కిపైగా దేశాల్లో క్లౌడ్ సేవలు అందిస్తున్నట్లు, ఈ వ్యాపార ఆదాయం కూడా కలిపితే మొత్తం రూ.800 కోట్లుగా నమోదుకావచ్చన్నారు కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.


Click it and Unblock the Notifications