భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై రిలయన్స్ గ్రూప్ ఆసక్తిని చూపుతోంది. సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.

ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
త్వరలో పిలిచే టెండర్లలో తాము కూడా పాల్గొంటామని చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చింది. ఆపై ఎయిర్‌పోర్టును నిర్మించలేమని చెప్పేసింది

అనిల్ అంబానీ
దీంతో ఈ సంస్థను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పిస్తూ భోగాపురం ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రఖ్యాత సంస్థలేమైనా ముందుకు వస్తాయేమోనని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబుతో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సమావేశమయ్యారు.

రూ.5వేల కోట్ల పెట్టుబడులతో
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. విశాఖ జిల్లా రాంబిల్లిలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో నావల్ షిప్‌బిల్డింగ్‌కు సంబంధించి 2వేల ఎకరాలు కేటాయించాలని అంబానీ కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని అనిల్ పేర్కొన్నారని సమాచారం.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం
4వేల మెగావాట్ల నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అలా్ట్ర పవర్ ప్రాజెక్టుపై ఇక ముందుకెళ్లలేమని అంబానీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల సామర్లకోటలోని రిలయన్స్ ఎనర్జీ 220మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని డిస్కమ్‌లు రద్దు చేసుకున్నాయి.

ఏపీ జెన్కో ఎండీ
ఈ అంశమూ భేటీలో చర్చకు వచ్చింది. పీపీఏల కాలపరిమితి ముగియడంతో రద్దు నోటీసును ఇప్పటికే జారీ చేశామని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వివరించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications