ఐ.టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికీ శుభవార్త! మీకోసమే చదవండి.
భారత ఐటి పరిశ్రమ ఈ ఏడాది 8 శాతం వృద్ధితో 16,700 కోట్ల డాలర్లకు (రూ.10.85 లక్షల కోట్లు) చేరబోతున్నదని, ఆ రంగంలో కొత్తగా లక్ష నియామకాలు జరిగే ఆస్కారం ఉన్నదని న్యాయ, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తనను కలిశారని, తాము ఐటి రంగానికి చెందిన అంశాలు విస్తృతంగా చర్చించామని తెలుపుతూ ఈ సందర్భంగా ఆమె తనకు ఈ విషయం తెలిపారని ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటి ఎగుమతులు 13,700 కోట్ల డాలర్లకు చేరనున్నాయని, మొత్తం ఐటి-బిపిఒ పరిశ్రమ పరిమాణం 1,400-1,600 కోట్ల డాలర్ల మధ్య ఉంటుందని నాస్కామ్ అంచనాలు ప్రకటించింది. శుక్రవారం దేవయాని ఘోష్ బ్రిటన్‌లో డిజిటల్ శాఖ మంత్రి మాట్ హాంకాక్‌తో కలిసి 4వ భారత యుకె టెక్ రాకెట్‌షిప్ అవార్డులను ప్రారంభించారు. కృత్రిమ మేథస్సు, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, ఐఒటి వంటి కొత్త టెక్నాలజీ విభాగాల్లోని భారత స్టార్ట్‌పల కోసం ఈ అవార్డులను ఏర్పాటు చేశారు. ఈ అవార్డులను గెలుచుకున్న వారికి 2019 లండన్ టెక్ వీక్‌లో పాల్గొని భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఇంక్యుబేటర్ల కోసం ప్రతిపాదనలు చర్చించే అవకాశం కలుగుతుంది.కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications