రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుభాయి అంబానీ చనిపోగానే ఆస్థి విషయంలో గొడవ పడ్డారు అన్నదమ్ములు మరి ప్రముఖంగా మొత్తం రిలయన్స్ పై పెత్తనం ముకేశ్ అంబానీ చెలాయించడంతో అనిల్ అంబానీకి అసలు ఇష్టం లేకుండా పోయింది.

బహిరంగంగా
ఇక ఫైనాన్స్ బిజినెస్ వ్యవహారంలో తనకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని ముకేశ్ కూడా తన ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లలో అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళక్కయాడు. దీని పై చర్యలు తీసుకోవాలి అని రహస్యంగా ప్రధానికి మరియు ఆ మంత్రులకి లేఖలు రాసాడు.

తల్లి కోకిలాబెన్ అంబానీ
దింతో పరువు పోతుంది అని గ్రహించిన అంబానీ సోదరుల తల్లి కోకిలాబెన్ అంబానీ 2005 లో ఇద్దరినీ కూర్చోపెట్టి ఆస్తులు పంచుకోమని సూచించారు.

కె. వీ.కామత్
ఈ విభజనకు అంబానీ కుటుంబానికి నమ్మకస్థుడు ఐన ఒకప్పటి ICICI CEO కె. వీ.కామత్ మధ్యవర్తిగా వ్యవహరించాడు.
ఇద్దరితో ఎన్ని చర్చలు జరిపిన కూడా ఆస్తుల విభజన ఒక కొలిక్కి రాలేదు. ఇద్దరు ఏదో ఒక కారణం పెట్టుకొని చర్చల మధ్యలోనే వెళ్లి పోయేవారు

ఫైనల్ ట్రాక్
ఆ తర్వాత చర్చల మీద చర్చలు జరిగాక కామత్ ఒక ఫైనల్ ట్రాక్ రెడీ చేసాడు, అది కోకిల అంబానీ ముందర ఉంచి ఎవరికీ ఏది కావాలో తీసుకోమన్నారు. ఐతే ఒకే వ్యాపారాన్ని ఇద్దరు పంచుకోవద్దు ఏదో ఒకటే తీసుకోవాలి అని చెప్పారు,

ముకేశ్ అంబానీకి బాగా కలిసి వచ్చింది
ఇక్కడే ముకేశ్ అంబానీకి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే రిలయన్స్ ఆయిల్ స్టార్ట్ చేసింది ఆయనే .తండ్రి ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆయిల్ కు మంచి డిమాండ్ ఉంటుంది అని ఇండియాలో కూడా ఆర్ధికంగా ఆయిల్ కు మంచి గిరాకీ ఉంటుంది అని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం తన గుపెటులో పెట్టుకున్నాడు. పైగా టౌ కెమికల్ ఇంజనీరింగ్ చదవడంతో తాను ఇంకా ఈజీగా సక్సెస్ అయ్యాడు.

రిలయన్స్ ఇండస్ట్రీస్
ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుడు కంపెనీ ఫ్లాగ్ షిప్ కంపెనీస్ గా పేరు ఉన్నాయి ఇందులో రిలయన్స్ ఆయిల్ . రిలయన్స్ గ్యాస్, మరియు టెక్సటైల్స్ కూడా ఉన్నాయి.

అనిల్ అంబానీ ఫైనాన్స్
ఇంకా అనిల్ అంబానీ ఫైనాన్స్ విభాగంలో సక్సెస్ అయ్యాడు. పైగా ఇమ్మీడియేట్ పనితో పాటు గ్రోత్ కూడా నెలవారీగా తెలిసిపోతుంది. మార్కెట్ విలువ కూడా పెరుగుతుండడంతో అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ పై ఇంట్రెస్ట్ చూపించాడు.

ఫ్యూచర్ మొత్తం
ఫ్యూచర్ మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతుంది అని భావించాడు. కానీ దానికి తగ్గటుగా ప్లాన్స్ వేయడంలో మాత్రం విఫలం అయ్యాడు.
రిలయన్స్ టెలికాం , రిలయన్స్ కాపిటల్, రిలయన్స్ ఇంఫ్రా, రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్, రిలయన్స్ పవర్ ని అనిల్ అంబానీ తీసుకున్నాడు.

ఆస్తుల విలువ
అప్పటిలో వారి ఆస్తుల విలువ రూ.90000 కోట్లు వీటిని ఇద్దరు సమానంగా పంచుకున్నారు. కానీ మారుతున్న కాలాన్ని పట్టి వ్యాపారంలో కొన్ని సక్సెస్ కాగా మరి కొన్ని మందకొడిగా మారాయి.

ఒక అడుగు ముందుకు
రెండు భాగాలుగా పంచుకున్నా కూడా రిలయన్స్ తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయింది. ఇటు అనిల్ అంబానీ కూడా దాదాపుగా 500 శాతం గ్రోత్ తో ముకేశ్ అంబానీ కంటే ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపించింది.

UPA సర్కార్
ఇక ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పైకి కనిపించకపోయినా కూడా ఆయిల్ బిజినెస్ లో లాభాలు వచ్చాయి. కానీ కొన్ని ఆయిల్ నిక్షపాలు ముకేశ్ అంబానీ ఆయిల్ బిజినెస్ నే మార్చేశాయి. అంతకంటే కూడా దాదాపు రూ. 1500 కోట్లు పెట్టుబడి పెట్టిన జాంనగర్ పెట్రోల్ ప్లాంట్ ముకేశ్ కు కాసుల వర్షం కురిపించింది. దింతో పెట్రోల్ ని రిటైల్ బిజినెస్ గా మార్చేశాడు. పైగా పెట్రోల్ ధరల నిర్ణయం పై అప్పటి UPA సర్కార్ కూడా ముకేశ్ కి భారీ సహాయం చేసింది అని విమర్శలు వచ్చాయి.

జాంనగర్
విదేశాల నుండి దిగుమతి చేసే పెట్రోల్ పై యాంటీ డంపింగ్ టాక్స్ వేసి రిలయన్స్ కి పరోక్షంగా సహాయ పడింది. పైగా జాంనగర్ లో తీసే పెట్రోల్ జాతీయ సంపద ఐన కూడా
ధర మాత్రం రిలయన్స్ కే వదిలేసింది. దింతో ముకేశ్ అంబానీ చాలా లాభాలు చూసాడు. దీని పై అప్పటిలో త్రీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి.

రిలయన్స్ పెట్రోల్ బంకులు
విదేశీ మార్కెట్ పడిపోవడంతో తెలివిగా రిలయన్స్ పెట్రోల్ బంకులు మూసేసాడు ముకేశ్. మళ్ళీ ధరలు అందుబాటులో వచ్చి లాభాల బాట పట్టగానే మళ్ళీ రిలయన్స్ పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి.

రిటైల్ వ్యాపారంలోకి
ఇక సంపాదించినా వాటితో రిటైల్ వ్యాపారంలోకి వచ్చాడు ఇటు కూరగాయలు, చెప్పులు , బట్టలు, ఎలక్ట్రానిక్స్ ఒకటేమి TV చానెల్స్ కూడా కొనేసాడు. ముకేశ్ బాగా ముందుకు వెళుతున్న సమయంలో అనిల్ అంబానీకి ఎదురు దెబ్బ తగిలింది.

బిజినెస్ బాగా దెబ్బ కొట్టింది
అనిల్ అంబానీకు ఇంఫ్రా బిజినెస్ బాగా దెబ్బ కొట్టింది ఆర్ధిక మాన్యంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఇంఫ్రాలో లాభాల మాట దేవుడు ఎరుగు విపరీతమైన నష్టాలను చూసింది.

రిలయన్స్ కమ్యూనికేషన్
ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా నష్టాలను ముట్టకట్టుకొంది CDMA నుండి GSM కు మరీనా కూడా ఎయిర్టెల్ , ఐడియా , వోడాఫోనెతో ఢీ కొట్టలేక చతికల పడ్డాడు అనిల్ అంబానీ.

అనిల్ అంబానీ వ్యాపారాన్ని నిలపెట్టాయి.
దింతో ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ విపరీతంగా పెరుగుతొంటే అనిల్ ఆస్తుల విలువ పడిపోతూ వచ్చాయి. ఐతే రిలయన్స్ ఎనర్జీ పవర్లు అనిల్ అంబానీ వ్యాపారాన్ని నిలపెట్టాయి.

గత ఏడాది రూ.650 కోట్లు
ఇక రిలయన్స్ క్యాపిటల్ కూడా గత ఏడాది రూ.650 కోట్లు లాభాలని మూటకట్టుకొంది రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పోలిస్తే ఇవి నాలుగు ఇంతలు తక్కువ .

జియో దెబ్బకు
భవిష్యత్తు ఆలోచించడంలో ముకేశ్ అంబానీ దిట్ట అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ డబ్బులను ఇప్పుడు JIO లో పెట్టాడు. దాదాపుగా లక్ష కోట్లపైగా జియో డేటా వ్యాపారం పై ఆశలు పెట్టుకున్నాడు. అనుకున్నట్లు గానే మిగతా కమ్యూనికేషన్ కంపెనీలు జియో దెబ్బకు చెల్లాచెదురు అయ్యాయి. ఇక అనిల్ అంబానీ రిలయన్స్ కామింకేషన్ కూడా జియో దెబ్బకు దాదాపు రూ.1000 కోట్లు నష్టం చూసింది.

బిజినెస్ పార్టనర్ కోసం
అసలే అంతత మాత్రం ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. అప్పులు ఎక్కువ కావడంతో బిజినెస్ పార్టనర్ కోసం వెతుకుతున్నాడు అనిల్ అంబానీ.

ఇక గత ఏడాది అనిల్ ముకేశ్ అంబానీ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
గత ఏడాది దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉంటె అనిల్ అంబానీ 32 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక ముకేశ్ అంబానీ ఆదాయం విలువ రూ.2,76,544 కోట్లు ఐతే అనిల్ అంబానీ రెవిన్యూ కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే. ఫోబ్స్ అంచనా ప్రకారం ముకేశ్ అంబానీ ఆస్థి విలువ $23 బిలియన్ డాలర్లు మరి తమ్ముడు అనిల్ అంబానీ ఆస్థి విలువ $3.3 బిలియన్ డాలర్లు.

ఆస్తుల విషయంలో చాలా తేడాలు
అందుకే ప్రచంచ ధనవంతుల స్థానంలో ముకేశ్ 36 వ స్థానంలో ఉంటె తమ్ముడు అనిల్ అంబానీ 688 వ స్థానంలో ఉన్నాడు. ఇలా ఆస్తుల విషయంలో చాలా తేడాలు రావడంతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్ మునిగిపోయే పరిస్థితి రావడంతో తనను టెలికాం బిజినెస్ లోకి రానిచ్చినందుకు తమ్ముడు అనిల్ అంబానీని ఆదుకున్నాడు తన అన్న ముకేశ్ అంబానీ వాస్తవానికి ఒకరి వ్యాపారంలోకి ఇంకొకరు రాకూడదు అని నిబంధన ఉంది.

తల్లితో చెప్పించి
కానీ రిలయన్స్ టెలికాం విఫలం కావడంతో తల్లితో చెప్పించి మరి జియోని తెప్పించాడు ముకేశ్ అంబానీ. అందుకే నష్టాల్లో పడ్డ రిలయన్స్ టెలికాంని జియోలోకి కలిపివేసినందుకు ఒప్పకున్నాడు.

కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ జవదాటవు.
ఇలా వ్యాపారంలో చురుకుకైనా నిర్ణయాలు తీసుకోలేక అనిల్ అంబానీ వెనకపడ్డాడు. ఇక ముకేశ్ అంబానీ మాత్రం తన తండ్రి కంటే కూడా దూకుడుగా వెళుతున్నాడు. పైగా కాలంకూడా ముకేశ్ అంబానీకి అనుకూలంగా మారింది. ప్రభుత్వాలు తన చేతులో పెట్టుకొని తన వ్యాపారిని పెంచుకున్నాడు. ఈ విషయంలో అనిల్ అంబానీ వెనకపడ్డాడు. ప్రభుత్వం ఏది మరీనా కూడా ముకేశ్ అంబానీ మాటను ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ జవదాటవు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications