దాదాపు నెల రోజుల తరువాత, భారతదేశం అంతటా గత రెండు రోజుల్లో బంగారం కొనుగోలు సెంటిమెంట్ పునరుద్ధరించింది అక్షయ త్రితీయ న డెలివరీ కోసం ముందుగా బుక్ చేస్కుంటున్నా వినియోగదారులు,ఈ సంవత్సరం రాబోయే బుధవారం.
దాదాపు నెల రోజుల తరువాత, భారతదేశం అంతటా గత రెండు రోజుల్లో బంగారం కొనుగోలు సెంటిమెంట్ పునరుద్ధరించింది అక్షయ త్రితీయ న డెలివరీ కోసం ముందుగా బుక్ చేస్కుంటున్నా వినియోగదారులు,ఈ సంవత్సరం రాబోయే బుధవారం, ఏప్రిల్ 18 న ఈ రోజు కానుంది.

గత రెండు రోజుల్లో కస్టమర్ల రాకపోకలు దాదాపు 50 శాతం పెరుగుదల కనిపించిందని, విశ్లేషకులు ధరల పెరుగుదల సూచనతో, ఇప్పుడు కొనుగోలుదారులు తమ ఆభరణాల లేదా బంగారు వస్తువులను బుక్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారన్నారు.
ఇంకా వరుసగా పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. మరో వైపు అమెరికా-చైనా ట్రేడ్ వార్ కొనసాగే పరిస్థితులుండటంతో బంగారం కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. అహ్మదాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం ధర సోమవారం రోజున రూ.32,300గా పలికింది .అక్షయ తృతీయ సమీపిస్తున్న వేళ ఎగసిన ఈ ధర ఇంతవరకూ అత్యధికం కావడం గమనార్హం.
గత నెల రోజుల ముందు నుండి బంగారం ధర రూ.30 వేలకు మించి పెరగలేదు,ఐతే ఇప్పుడు బంగారం ధరలు అక్షయ తృతీయకు ముందే పైపైకి పోతున్నాయి.ఇది వచ్చే 3-4 రోజులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధరలు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి .ఇప్పుడైతే అమెరికా,చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరిగాయి. మధ్య తరగతి బంగారం కొనేందుకు కష్టమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయకు బంగారం కొనడం అంత సులువైన వ్యవహారమేమీ కాదు.


Click it and Unblock the Notifications