For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తిపన్ను వసూలులో జీహెచ్‌ఎంసీ రికార్డు... అబ్బా బాదేశారుగా

By Sabari
|

జీహెచ్‌ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం రూ. 1,321 కోట్లను వసూళ్లు చేసి రికార్డు సాధించింది. నగరాభివృద్ధికి ఆస్తిప న్ను ఎలా దోహదపడుతుందనే విస్తృత ప్రచారంతో ఈ సారి రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

అదనంగా వసూలు

అదనంగా వసూలు

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం రూ. 115 కోట్లు అదనంగా వసూలు చేశారు. 2015-16లో మొత్తం రూ.1025.45 కోట్లు ఆస్తిపన్నుగా సేకరించగా, గత సంవత్సరం 2016-17 సంవత్సరంలో ఈ ఆస్తిపన్ను రికార్డుస్థాయిలో రూ.1205 కోట్లుగా జీహెచ్‌ఎంసీ వసూలు చేసింది. పెద్ద నోట్ల రద్దుతో గత సంవత్సరం భారీస్థాయిలో ఆస్తిపన్ను బకాయిలను చెల్లించడంతో ఆస్తిపన్ను పన్నెండు వందలకోట్లకు చేరింది.

రూ.116 కోట్లకు

రూ.116 కోట్లకు

ప్రస్తుత 2017-18 సంవత్సరానికి ఆస్తిపన్ను సేకరణ లక్ష్యాన్ని రూ. 1400 కోట్లుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయించారు. గత సంవత్సరం వసూలైన ఆస్తిపన్నుకంటే అ దనంగా మరో రూ. 50 కోట్లు వసూలవుతాయని అంచనా వేసిన అధికారులు అంచనాకు మించి రూ.116 కోట్లకు పైగా వసూలు చేశారు.

ట్రేడ్‌లైసెన్స్‌

ట్రేడ్‌లైసెన్స్‌

ట్రేడ్‌ లైసెన్స్‌ల విషయంలో లక్ష్యాన్ని మించి రూ.54 కోట్లకు పైగా వసూలు కావడం ద్వారా ట్రేడ్‌ లైసెన్స్‌ రం గంలో జీహెచ్‌ఎంసీ సరికొత్త రికార్డు సృష్టించింది. 2016-17లో రూ. 42 కోట్లు మాత్రమే ట్రేడ్‌లైసెన్స్‌ రెన్యువల్‌ కింద వసూలు కాగా 2017-18లో రికార్డు స్థాయిలో మరో రూ.12 కోట్లు అదనంగా ఇప్పటివరకూ రూ.54 కోట్లు లభించాయి. 2015-16లో ట్రేడ్‌ లెసెన్స్‌ల ద్వారా కేవలం రూ. 28.50 కోట్ల రూపాయల మాత్రమే వసూలయ్యాయి.

ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఈస్ట్‌, సౌత్‌జోన్లు

ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఈస్ట్‌, సౌత్‌జోన్లు

2017-18 సంవత్సరానికి ఆస్తిపన్ను కింద రికార్డు స్థాయి లో రూ.1,321 కోట్లు వసూళ్లయ్యాయి. మైనార్టీలు, మధ్యతరగతి నివాసితులు అధికంగా ఉండే సౌత్‌, ఈస్ట్‌ జోన్‌లో సౌత్‌జోన్‌లోని చార్మినార్‌- 5మీ, ఏ సర్కిళ్లు వరుసగా తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 105.76 శాతం, 105.22 శాతం పన్నులను వసూలు చేశాయి. ఈస్ట్‌ జోన్‌లోని హయత్‌నగర్‌ సర్కిల్‌ 102.93 శాతం, సరూర్‌నగర్‌ సర్కిల్‌ 102 శాతం, కాప్రా సర్కిల్‌ 101.81 శాతం పన్ను వసూళ్ల ద్వారా మొత్తం జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిసారి పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచే సెంట్రల్‌ జోన్‌లోని సర్కిళ్లలో ఖైరతబాద్‌ 10సీ సర్కిల్‌ 10.3.69 శాతం, ఖైరతాబాద్‌ 7 బి సర్కిల్‌ 101.95 శాతం పన్ను వసూళ్లను సాధించాయి.

అతి తక్కువగా ఆబిడ్స్‌ సర్కిల్‌

అతి తక్కువగా ఆబిడ్స్‌ సర్కిల్‌

2018లో ఆబిడ్స్‌ సర్కిల్‌ 93.08 శాతంలో కిందిస్థానంలో నిలవగా తర్వాత స్థానంలో ఉప్పల్‌ 80.51 శాతం, మల్కాజిగిరి సర్కిల్‌ 83.77 శాతం, కూకట్‌పల్లి 83.70 శాతం, కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ 86.19 శాతం తర్వాతి స్థానంలో నిలిచాయి.

ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఆసక్తి

ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఆసక్తి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం 3,08,339 మంది తమ ఆస్తిపన్నును ఆన్‌లైన్‌ ద్వారా రూ. 200 కోట్లు చెల్లించారు. భవన క్రమబద్ధీకరణ చేసిన 1,21,019 దరఖాస్తులు 28,859 ఆస్తులకు రూ.35.24 కోట్లను ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర వ్యత్యాసం ఉండేది. ఈ సారి ఆస్తిపన్ను కింద వసూ లు చేశారు. అంచనాలకు మించి ఆస్తిపన్ను చెల్లింపులో అగ్రస్థా నం లో సౌత్‌, ఈస్ట్‌ జోన్‌ సర్కిళ్లు ముందంజలో ఉండడంపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ హర్షం వ్యక్తం చేశారు.కంటెంట్ courtesy ABN

Read more about: tax hyderabad
English summary

ఆస్తిపన్ను వసూలులో జీహెచ్‌ఎంసీ రికార్డు... అబ్బా బాదేశారుగా | GHMC Record For Property Tax Collection

GHMC is expected to earn Rs. 1,321 crores has been recorded.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X