ఈ బ‌డ్జెట్లో 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపుల‌ను మారుస్తున్నారా?

కొంత మంది ప‌న్ను ఆదా ప‌థ‌కాల్లో ముఖ్యమైన మార్పుల‌ను చేప‌డ‌తార‌ని అంటున్నారు. ఇంత‌కూ దీని గురించి ఏం జ‌ర‌గొచ్చో, ఎలా అయితే మ‌న‌కు ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసుకుందాం.

ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుల‌ను ఈ ఏడాది బ‌డ్జెట్లో మ‌రింత పెంచుతారా?

యూనియ‌న్ బ‌డ్జెట్ 2018-19లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మ‌రింత పెంచుతార‌ని మ‌ధ్య‌త‌ర‌గతి వారు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఒక ప‌క్క వ్యాపారుల నుంచి సామాన్యుడి వ‌ర‌కూ చాలా రోజుల నుంచి దీని కోస‌మే ఎదురు చూస్తున్నారు. కొంత మంది ట్యాక్స్ శ్లాబుల‌నే కేంద్రం మారుస్తుంద‌ని ఊహాగానాల‌ను చేస్తుండ‌గా, కొంత మంది ప‌న్ను ఆదా ప‌థ‌కాల్లో ముఖ్యమైన మార్పుల‌ను చేప‌డ‌తార‌ని అంటున్నారు. ఇంత‌కూ దీని గురించి ఏం జ‌ర‌గొచ్చో, ఎలా అయితే మ‌న‌కు ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసుకుందాం.

 రూ.1.5 ల‌క్ష వ‌ర‌కూ ప‌రిమితి

రూ.1.5 ల‌క్ష వ‌ర‌కూ ప‌రిమితి

ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.1,50,000 వ‌ర‌కూ ప్ర‌తి ప‌న్ను చెల్లింపు దారుకు మిన‌హాయింపుల కోసం అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ప‌న్ను ఆదా కోసం ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియంలు, జాతీయ పొదుపు ప‌త్రాలు, ఈఎల్ఎస్ఎస్ వంటి వాటిని 80సీ కింద ఉప‌యోగించుకోవ‌చ్చు. 80సీ ప‌రిమితిని పెంచితే ప‌న్ను చెల్లించే వ్య‌క్తులు మ‌రింత ఆదాయాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. ఎక‌న‌మిక్ టైమ్స్ నివేదించిన దాని దాని ప్ర‌కారం ఇప్పుడున్న‌ రూ.1.5 ల‌క్ష నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఈ బ‌డ్జెట్లో 80సీ ప‌రిమితిని పెంచే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చివ‌రిసారిగా 2014-15 బ‌డ్జెట్లో సెక్ష‌న్ 80సీ ప‌రిమితిని రూ.1 ల‌క్ష నుంచి రూ.1.5 ల‌క్ష‌కు పెంచారు.

80సీ ప‌రిమితి పెంపు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం

80సీ ప‌రిమితి పెంపు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం

జీవిత బీమా, ఈక్విటీ సంబంధిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ), ఐదేండ్ల నోటిఫైడ్ ట్యాక్స్-సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు, ఐదేండ్ల కాలపరిమితి కలిగిన తపాలా శాఖ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్‌సీఎస్‌ఎస్), సుకన్య సమృద్ధి ఖాతా, ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) తదితర వాటిల్లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ పన్ను రాయితీలు వర్తిస్తాయి. అంతేగాక ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులపైనా ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా హోమ్ లోన్‌పై ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లింపుల విషయంలో అదనపు ప్రయోజనం రూ.50,000 వరకు ఉంటుంది. అందుకే చాలామంది పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80సీ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఈసారి బడ్జెట్‌లో ఈ డిమాండ్ నెరవేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ పెంపు అధిక వేతన ఉద్యోగులకూ లాభమే. ఇదిలావుంటే పన్ను చెల్లింపుదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదాయ అంచనాల స్వచ్చంధ నివేదిక ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి.

సెక్షన్ 80సీ పరిమితి పెరుగుదల - ప్రభావం

సెక్షన్ 80సీ పరిమితి పెరుగుదల - ప్రభావం

ప్రస్తుతం ప్రతిపాదన అదనపు పన్ను ప్రయోజనం

సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 రూ.2,00,000 -----

పన్ను రేటు - 5 శాతం రూ.7,725 రూ.10,300 రూ.2,575

పన్ను రేటు - 20 శాతం రూ.30,900 రూ.41,200 రూ.10,300

పన్ను రేటు - 30 శాతం రూ.46,350 రూ.61,800 రూ.15,450

గమనిక: 3 శాతం సర్‌చార్జీ కలుపుకొని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+