నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ఐడియా-వోడాఫోన్ సంస్థల విలీన ప్రక్రియకు ఈ నెల 11న ఆమోదం తెలిపింది. రుణదారులు మరియు చందాదారుల ప్రేయోజనాల దృష్ట్యా ఈ పథకం రూపుదిద్దుకుందని ఎన్‌సీఎల్‌టీ యొక్క
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ఐడియా-వోడాఫోన్ సంస్థల విలీన ప్రక్రియకు ఈ నెల 11న ఆమోదం తెలిపింది. రుణదారులు మరియు చందాదారుల ప్రేయోజనాల దృష్ట్యా ఈ పథకం రూపుదిద్దుకుందని ఎన్‌సీఎల్‌టీ యొక్క అహమ్మదాబాద్ బెంచ్ శుక్రవారం తెలిపింది.దీనికి సంబంధించిన మరిన్ని పరిణామాలను తెలుసుకుందాం.

1. ఇదివరకే అనుమతులు
ఈ రెండు టెలికాం సంస్థలు మూలధన మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), వాటాదారులు మరియు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ల నుండి అనుమతులు పొందాయి. వారు ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి అనుమతి పొందాలి (DoT). విలీన ప్రక్రియ జూన్ నాటికి పూర్తి అవుతుందని,కాగా అంతకు ముందుగా అమలు కావచ్చని సంస్థ వారు పేర్కొన్నారు.

2. అతిపెద్ద సంస్థగా ఐడియా-వోడాఫోన్
మార్చ్ 20,2017 లో 23 బిలియన్ల కస్టమర్లను కలిగి భారత దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఏర్పడనుంది.ప్రస్తుతం టెలికం రంగంలో భారతీయ ఎయిర్టెల్ అతిపెద్ద సంస్థగా ఉండగా తాజాగా ఈ విలీన సంస్థలు స్థానాన్నిదక్కించుకోనుంది. టెలికాం రంగలో రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు గతేడాది మార్చిలో వోడాఫోన్-ఐడియా విలీన ప్రక్రియకు తెరలేపాయి.

3. విలీనంలో ముఖ్య విషయాలు
రెండు నెట్వర్క్‌ల విలీనంతో టెలికాంలో స్థిరీకరణ జరగనుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, నెట్వర్క్ స్థిరీకరణ, మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పునరుద్దరణ, మూలధన వినియోగంలో మార్పులు, నిర్వహణ అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం, ఇంధన ఖర్చులను తగ్గించుకోవడం వంటివి ప్రధాన సవాళ్లని ఐడియా సెల్యూలార్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు.
ఆయా మార్పుల కారణంగా కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు వీలు కలగడమే కాకుండా మరియు క్లయింట్లకు అధిక నాణ్యత సేవలను అందించడంలో తోడ్పడుతుంది."అధిక స్పెక్ట్రం లభ్యత మరియు పెద్ద సింగిల్ రేడియో యాక్సెస్ నెట్వర్క్, రేషనల్ సైట్ల నుండి పునర్వ్యవస్థీకరణ పరికరాల పునఃస్థాపనతోపాటు, మూలధన వ్యయం కూడా తగ్గుతుంది," అని టెలోకో పేర్కొంది.

4. విలీనంలో తదుపరి అడుగులు
బిర్లా యాజమాన్య సంస్థ ఇటీవలే వోడాఫోన్ ఇండియాతో విలీనం కావడానికి ముందుగా 6,750 కోట్ల రూపాయలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది .ఇందులో ప్రథమ శ్రేణిలో ప్రమోషనల్ షేర్లను జారీ చేయడం ద్వారా ఐడియా 3,250 కోట్ల రూపాయలను పెంచనుంది..
వోడాఫోన్, ఐడియా విలీనానికి ముందే ఆదిత్యా బిర్లా ప్రమోటర్ గ్రూప్ ఐడియా సంస్థ కోసం రూ.6750 కోట్లను సేకరించే పనిలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మొదటి దశ నిధుల్లో భాగంగా రూ. 99.50 విలువ చేసే షేర్లను ప్రమోటర్లకు అందుబాటులో ఉంచడం ద్వారా రూ.3250 కోట్లను సేకరించేందుకు ప్రయత్నాలను ఆరంభించింది. కొత్త సంస్థలో ఆదిత్యా బిర్లా గ్రూప్ వాటా 47% నుంచి 42 శాతానికి తగ్గనుంది. ఈ విలీన ప్రక్రియలో భాగంగా కొత్తగా వచ్చే ఉమ్మడి సంస్థలో ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థ ఐడియాకు మొదట 26% వాటా మాత్రమే దక్కనుంది. కొత్తగా ఏర్పడే సంస్థలో ఎక్కువ భాగం నిధులను అప్పులు తీర్చేందుకే రెండు సంస్థలు ఉపయోగిస్తాయని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications