For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ‌త త్రైమాసికంతో పోలిస్తే మెరుగుప‌డ్డ టీసీఎస్ ప‌నితీరు

దేశంలో అతిపెద్ద సాఫ్టేవ‌ర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నికర లాభం 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 3.6 శాతం తగ్గిపోయింది. కంపెనీ ఈ త్రైమాసికంలో రూ. 6,531 కోట్ల నికర లాభాన

|

దేశంలో అతిపెద్ద సాఫ్టేవ‌ర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నికర లాభం 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 3.6 శాతం తగ్గిపోయింది. కంపెనీ ఈ త్రైమాసికంలో రూ. 6,531 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్‌ఎస్ 2016 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ. 6,778 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

 టీసీఎస్ ఫ‌లితాలు

మూడో మధ్యంతర డివిడెండ్‌ కింద ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.7 డివిడెండ్‌ అందించడానికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ మొత్తాన్ని జనవరి 31న వాటాదార్లకు చెల్లించనున్నారు. కాగా గురువారం బిఎస్‌ఇలో టిసిఎస్‌ షేర్‌ విలువ 0.67 శాతం తగ్గి రూ.2,788.40 వద్ద ముగిసింది.
గత త్రైమాసికంలో తాము మెరుగైన ప్రగతిని కనబర్చామని టిసిఎస్‌ సిఇఒ, ఎండి గోపినాథ్‌ పేర్కొన్నారు. పరిశ్రమ పుంజుకుంటుందని దీంతో కొత్త ఒప్పందాలతో పాటు క్లయింట్లు పెరుగుతున్నారన్నారు. మరింత బలమైన వృద్ధిరేటును సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. క్రితం క్యూ3లో 50 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే మూడు కొత్త క్లయింట్లను టిసిఎస్‌ పొందింది. 20 మిలియన్లు పైగా విలువ చేసే 7 మంది ఖాతాదారులను, 10 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే 9 మంది క్లయింట్లు, 5 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే 15 మంది క్లయింట్లను సాధించింది. గత డిసెంబర్‌ ముగింపు నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,90,880 మందికి చేరింది. గత త్రైమాసికంలో నికరంగా 1,667 మంది పెరిగారు. లాభాలకు ముందు ఫైనాన్స్‌, వ్యయం 2 శాతం పెరిగి రూ.8,651 కోట్లకు చేరింది.

Read more about: tcs companies
English summary

గ‌త త్రైమాసికంతో పోలిస్తే మెరుగుప‌డ్డ టీసీఎస్ ప‌నితీరు | TCS posts 1.3% QoQ rise in Q3 PAT, in line with estimates

Tata Consultancy Services, the country's largest IT firm, on Thursday reported 1.3 per cent quarter-on-quarter (QoQ) rise in net profit at Rs 6,531 crore for the quarter ended December 31, 2017. It had posted net profit of Rs 6,446 crore in the sequential quarter ended September 30, 2017
Story first published: Friday, January 12, 2018, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X