For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 బ‌డ్జెట్ నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వారి ఆకాంక్ష‌లు ఇవి

ప‌న్ను చెల్లింపుదారు స్వ‌త‌హాగా ప‌న్నులు క‌ట్టేలా ఆస‌క్తి చూపించేలా చేయాలి త‌ప్ప బ‌ల‌వంతంగా, భారంగా క‌ట్టాల్సి వ‌చ్చేలా చేయ‌డం భావ్యం కాదు అని నిపుణుల భావ‌న‌. దీన్ని ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా సాధించ‌వ

|

2018 బ‌డ్జెట్ నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వారి ఆకాంక్ష‌లు వే
మ‌న దేశంలో చాలా మంది ప‌న్ను చెల్లించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. దీనికి ఇక్క‌డున్న అధిక ప‌న్ను రేట్లే ఒక కార‌ణంగా చెప్పొచ్చు. అంతే కాకుండా తాము ప‌న్ను రూపంలో క‌ట్టేదంతా ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌కు స‌రైన రీతిలో ఉప‌యోగించ‌ద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో వేళ్లూనుకుంది. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న రావాల్సి ఉంది. మ‌న దేశంలో ప‌న్నులు మ‌రీ అధికంగా ఉన్నాయ‌ని ట్యాక్స్ ఎక్స్‌ప‌ర్ట్స్ కూడా అంటుంటారు. ప‌న్ను ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డ‌మో, ప్రోత్సాహ‌కాలు అందించ‌డం ద్వారానో ప‌న్ను వ‌సూళ్ల‌ను ప్ర‌భుత్వం పెంచుకోవ‌చ్చు.
ప‌న్ను చెల్లింపుల‌దారుల‌పై భారాన్ని త‌గ్గించేందుకు సాధ్యాసాధ్యాల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలించ‌డం ఎంతో ముఖ్యం. ప‌న్ను చెల్లింపుదారు స్వ‌త‌హాగా ప‌న్నులు క‌ట్టేలా ఆస‌క్తి చూపించేలా చేయాలి త‌ప్ప బ‌ల‌వంతంగా, భారంగా క‌ట్టాల్సి వ‌చ్చేలా చేయ‌డం భావ్యం కాదు అని నిపుణుల భావ‌న‌.
దీన్ని ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా సాధించ‌వ‌చ్చు. మ‌చ్చుకు కొన్ని...

1. ప‌న్ను ఎగ్గొట్టేవారిని గుర్తించాలి

1. ప‌న్ను ఎగ్గొట్టేవారిని గుర్తించాలి

ప‌న్ను ఎగ్గొట్టేవారిని గుర్తించి వారు ప‌న్నులు చెల్లించేలా చూడ‌డం ద్వారా సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా ఇది సాధ్య‌మ‌వుతుంది. లావాదేవీల ఛార్జీలు త‌గ్గించ‌డం, డిజిట‌ల్ రూపంలో వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను త‌గ్గించ‌డం లాంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాకు ప‌న్నుల రూపంలో బాగానే వ‌స్తుంది.

2. ప్రోత్సాహ‌కాల ద్వారా...

2. ప్రోత్సాహ‌కాల ద్వారా...

భార‌త్ వెలుప‌ల నివ‌సించేవారికి త‌మ నిధుల‌ను ఇక్క‌డి పంపించుకునే క్ర‌మంలో ప‌న్నుల‌పై ప్రోత్సాహ‌కాల‌ను ప్ర‌క‌టించాలి. త‌ద్వారా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌రిన్ని నిధులు వ‌చ్చి చేర‌తాయి. అంతే కాకుండా ప‌న్ను త‌గ్గింపుతో పాటు అధిక రాబ‌డిని పొందేందుకు ప్ర‌భుత్వానికి మంచి అవ‌కాశం లభిస్తుంది.

3. విదేశీ మార‌కం పెరిగేలా...

3. విదేశీ మార‌కం పెరిగేలా...

ఎగుమ‌తి, దిగుమ‌తి వ్యాపారాల్లో ఉన్న‌వారికి ప‌న్ను రేట్ల‌ను త‌గ్గించాలి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని ప‌న్ను రేట్ల‌లో మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దీని వ‌ల్ల విదేవీ మార‌కం బాగా పెరిగి దేశానికి మంచి ఆదాయం స‌మ‌కూరుతుంది.

4. గృహరుణ‌ వ‌డ్డీపై ప‌రిమితి ఎత్తేయ‌డం ద్వారా...

4. గృహరుణ‌ వ‌డ్డీపై ప‌రిమితి ఎత్తేయ‌డం ద్వారా...

గృహ‌రుణాల‌పై వ‌డ్డీ చెల్లింపుల్లో రూ.2ల‌క్ష‌ల ప‌రిమితిని ఎత్తివేయ‌డం ద్వారా లేదా క‌నీసం ఒక్క స్థిరాస్తి ఉన్న‌వారికి ఇప్ప‌టిదాకా రూ.5లక్ష‌ల ప‌న్ను ప‌రిమితిని మ‌రింత‌ పెంచ‌డం ద్వారా స్థిరాస్తి రంగానికి ప్ర‌భుత్వం ఊత‌మిచ్చే దిశ‌గా నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంది. దీని ద్వారా ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయి.

5. అన్ని వృత్తుల‌వారికి మిన‌హాయింపు

5. అన్ని వృత్తుల‌వారికి మిన‌హాయింపు

కొన్ని ర‌కాల వృత్తుల వారికే సెక్ష‌న్ 44ADA కింద పన్ను ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తున్నాయి. దీన్ని అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తే లాభ‌దాయ‌కంగా ఉంటుంది. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో ప‌న్ను ఎగ్గొట్టాల‌నే ధోర‌ణి వీడిపోతుంది. ప‌న్ను చెల్లించేవారి సంఖ్యా పెరుగుతుంది.

ఇలా అనేక ర‌కాలుగా ప‌న్ను భారాన్ని ప్ర‌జ‌లపై ప‌డ‌కుండా ప్ర‌భుత్వం చూసుకోవ‌చ్చు. అయితే ఈ బ‌డ్జెట్ 2018 కోస‌మైతే ముఖ్యంగా ఈ 5 అంశాల‌ను ప‌రిశీలిస్తే బాగుంటుంది.

విత్త మంత్రీ ఆల‌కిస్తారా ప్ర‌జ‌ల విన్న‌పాల‌ను! చూడాలి మ‌రి

English summary

2018 బ‌డ్జెట్ నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వారి ఆకాంక్ష‌లు ఇవి | 5 top ways income tax cut can be effected by FM Arun Jaitley in this budget

One of the reasons why most people are reluctant to pay tax in India is they think that the tax rates are very high, and also that the money they pay in taxes is not properly utilised by the government for the welfare of the people of this country. While people need to be educated on this, even tax experts believe that income tax rates are high in India and the tax compliance will increase if the people are given some incentives in the form of lower taxes.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X