సరికొత్త రికార్డులను నెలకొల్పిన భారత విదేశీ మారక నిల్వలు
మన దేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 400 బిలియన్ డాలర్ల మార్కును దాటి, విదేశీ కరెన్సీ ఆస్తుల్లో సంభవించిన గణనీయమైన పెరుగుదలతో మొదటిసారి ఫారెక్స్ నిల్వలు 409.366 బిలియన్ డాలర్లుగా నమో
భారత దేశ విదేశీ మారకపు నిల్వలు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. మొదటిసారి దేశ మారక నిల్వల చరిత్రలోనే కొత్త రికార్డును నెలకొల్పాయి. మన దేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 400 బిలియన్ డాలర్ల మార్కును దాటి, విదేశీ కరెన్సీ ఆస్తుల్లో సంభవించిన గణనీయమైన పెరుగుదలతో మొదటిసారి ఫారెక్స్ నిల్వలు 409.366 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. డిసెంబరు 29తో ముగిసిన వారానికి ఆర్బీఐ విడుదల చేసిన సమాచారం మేరకు దేశ విదేశీ మారక నిల్వలు ఈ విధంగా ఉన్నాయి. అంతకు ముందు వారం దేశ విదేశీ మారక నిల్వలు 3.53 బిలియన్ డాలర్ల మేర పెరిగి 404.921 బిలియన్ డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఆర్బీఐ నివేదించిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 4.423 బిలియన్ డాలర్ల మేర పెరిగి 385.103 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. మొత్తం భారతదేశ విదేశీ మారక నిల్వల్లో సింహ భాగం విదేశీ కరెన్సీ ఆస్తులు(ఫారిన్ కరెన్సీ ఆస్తులు) ఉంటాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు ఎక్కువగా యూరో, పౌండ్, యెన్ కరెన్సీల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉంటాయి.
మరో వైపు బంగారు నిల్వలు మాత్రం ఏ విధమైన మార్పు లేకుండా 20.716 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ప్రతి దేశం ఒక కరెన్సీ కలిగి ఉంటుంది. అయితే ఇతర దేశాలతో వాణిజ్యం చేయాలంటే చెల్లింపుల కోసం ప్రపంచంలో ముఖ్యమైన పలు కరెన్సీలను తన వద్ద కలిగి ఉండాల్సిందే. ఉదాహరణకు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ విదేశీ కరెన్సీ ఆస్తులను కలిగి ఉంటుంది. విదేశీ మారక నిల్వల్లో బ్యాంకు నోట్లు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలు వంటివి ఉంటాయి.


Click it and Unblock the Notifications