ఐడియా సెల్యులర్ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ సంస్థ, ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి భారీగా నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు 32.66 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్
ఐడియా సెల్యులర్ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ సంస్థ, ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి భారీగా నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు 32.66 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించి రూ.3,250 కోట్లు సమీకరిస్తున్నట్లు ఐడియా సెల్యులార్ తెలిపింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.99.50 ధరకు కేటాయించాలని తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఐడియా సెల్యులార్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన బిర్లా టీఎమ్‌టీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలైనె ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), ఒరియానా ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), సూర్య కిరణ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్)లకు ఈ షేర్లు కేటాయిస్తామన్నారు. ఈ షేర్ల కేటాయింపు వచ్చే నెల ప్రారంభంలోనే పూర్తవుతుందని, దీనివల్ల ఐడియాలో ప్రమోటర్‌గ్రూప్ వాటా ప్రస్తుత 42.4 శాతం నుంచి 47.2 శాతానికి పెరుగుతుందని బిర్లా పేర్కొన్నారు.
అదనంగా మరో రూ3,500 కోట్లు సమీకరణ
అదనంగా మరో రూ.3,500 కోట్ల నిధుల సమీకరణ కోసం అన్వేషించాల్సిన మార్గాల నిమిత్తం ఒక ప్యానెల్‌ను నియమించామని కుమార మంగళం తెలియజేశారు. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్), రైట్స్ ఇష్యూ. తదితర మార్గాల ద్వారా ఈ పెట్టుబడులు సమీకరించే అవకాశాలున్నాయన్నారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లతో ఏర్పాటు చేసిన టెలికం టవర్ల జాయింట్ వెంచర్, ఇండస్ టవర్స్‌లో కంపెనీకున్న 11.15 శాతం వాటాను కూడా విక్రయించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారాయన. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో 33,500 వైర్లెస్ బ్రాడ్‌బాండ్ సైట్స్‌ను అదనంగా ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం బ్రాడ్‌బాండ్ సైట్స్ 1,43,500కు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వోల్ట్ (వాయిస్ ఓవర్ 4జీ నెట్‌వర్క్) సేవలను కూడా అందించాలని యోచిస్తున్నామని బిర్లా వివరించారు.

ఇవే కాకుండా వోడాఫోన్ విలీనానికి సంబంధించి సైతం ఐడియాలోకి భారీగా నిధుల రాక రానున్నట్లు తెలుస్తున్నది. వోడాఫోన్ గ్రూప్ ద్వారా అదనంగా రూ.9350 కోట్ల మేర నిధులను ఐడియా సంస్థ రాబడుతుంది. వచ్చే సొమ్ములో సింహ భాగాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగిస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications