పోస్ట్ పెయిడ్‌పై వినియోగ‌దారుల‌ అనాస‌క్తి

టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వినియోగ‌దారులు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పోస్టు పెయిడ్‌ ఖాతాదారులు మరో 2 శాతం తగ్గారని అంచనా. దీంతో

4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత చెల్లింపుల కంటే ప్రీపెయిడ్‌ పైనే ఎక్కువ అసక్తి చూపుతున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పోస్టు పెయిడ్‌ ఖాతాదారులు మరో 2 శాతం తగ్గారని అంచనా. దీంతో కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలికం రంగంలో ప్రీపెయిడ్‌ ఖాతాదారుల సంఖ్య 95.6 శాతానికి చేరింది. అదే ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఈ వాటా 95.52 శాతంగా ఉంది. ఇదే కాలంలో 5.17 కోట్ల మంది పోస్టుపెయిడ్‌ వినియోగదారులు ఉన్నారని టెలికాం నియంత్ర‌ణ సంస్థ‌ ఈ మధ్య కాలంలో ఒక నివేదికలో తెలిపింది. ఇంతక్రితం వినియోగదారులతో పోల్చితే 1.84 శాతం తగ్గారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లోని కేటగిరి ఎ, బి సర్కిళ్లలో పోస్టుపెయిడ్‌ ఖాతాదారులు క్రమంగా తగ్గిపోతున్నారు.

పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్‌కు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పోస్టు పెయిడ్‌ సెగ్మెంట్‌ రెవెన్యూ 10 శాతం క్షీణించి రూ.5,900 కోట్లకు పరిమితమయ్యిందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ కొటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇదే సమయంలో ప్రీపెయిడ్‌ రెవెన్యూ 9 శాతం పెరిగి రూ.24,000 కోట్లకు చేరింది. 2015-16లో పోస్టుపెయిడ్‌ రెవెన్యూ 30-40 శాతం పడిపోతే, ప్రస్తుతం మరో 20 శాతం మేర క్షీణించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా టెలికం కంపెనీలు పోస్టు పెయిడ్‌ ఖాతాదారులను ఆకర్షించి రెవెన్యూ పెంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే ప్రీపెయిడ్‌ విభాగంలో ఆకర్షణీయ ఆఫర్లు రావడంతో ఖాతాదారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై మరింత ఆర్ధిక ఒత్తిడి నెలకొననుందని విశ్లేషిస్తున్నారు. ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌ టారీఫ్‌ల మధ్య ఉన్న భారీ అంతరమే ప్రీపెయిడ్‌ చెల్లింపుల వైపు మొగ్గేలా చేస్తున్నాయని ఫిచ్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ పేర్కొన్నారు. కాగా పోస్టు పెయిడ్‌లోని సౌలభ్యాలను ప్రీపెయిడ్‌ సెగ్మెంట్‌ మాత్రం పూర్తి చేయలేదని మరో టెలికం విశ్లేషకులు ప్రశాంత్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. పోస్టు పెయిడ్‌లో నిరంతర వాయిస్‌ కాల్స్‌, డాటా సర్వీసెస్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ లాంటి కీలక సదుపాయాలు ఉన్నాయన్నారు. జియో రాకతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ప్రీపెయిడ్‌ ఖాతాదారుల్లో వృద్ధి చోటు చేసుకుందని సోనీ పేర్కొన్నారు. మరోవైపు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టెలినార్‌, టాటా టెలీ సర్వీసెస్‌ లాంటి టెలికం కంపెనీల పోస్టుపెయిడ్‌ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారారు. జియో ఆకర్షణీయ ప్రీపెయిడ్‌ ఆఫర్లు ఖాతాదారులను ఈ విభాగం వైపు ఆసక్తిని పెంచేలా చేశాయన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+