డిసెంబరు 25 నాటికి రూ.80,808 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అంతక్రితం నవంబర్ మాసంలో ఇవి రూ.83,000 కోట్లు వసూళ్లయ్యాయి. ఈ మాసంలో 53.06 లక్షల రిటర్న్‌లు ఫైలింగ్ అయ్యాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంగళవా
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు ఉసూరుమనిపిస్తున్నాయి. వరుసగా రెండో మాసంలోనూ వసూళ్లు పడిపోయాయి. డిసెంబరు 25 నాటికి రూ.80,808 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అంతక్రితం నవంబర్ మాసంలో ఇవి రూ.83,000 కోట్లు వసూళ్లయ్యాయి. ఈ మాసంలో 53.06 లక్షల రిటర్న్‌లు ఫైలింగ్ అయ్యాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక నివేదికలో తెలిపింది.

రూ.80,808 కోట్ల వసూళ్లలో రూ.7,798 కోట్లు పరిహార సెస్ కింద వచ్చాయి. రూ.13,089 కోట్ల సెంట్రల్ జిఎస్‌టి కింద నమోదయ్యాయి. మరో రూ.18,650 కోట్లు స్టేట్ జిఎస్‌టి కింద వసూళ్లయ్యాయి. కాగా రూ.41,270 కోట్లు ఇంటిగ్రేటెడ్ గూడ్స్‌అండ్ సర్వీసు ట్యాక్స్ (ఐజిఎస్‌టి) కింద వచ్చాయి. మరో రూ.10,348 కోట్లు ఐజిఎస్‌టి నుంచి సిజిఎస్‌టికి బదిలీ అయ్యాయి. కాగా ఐజిఎస్‌టి క్రెడిట్ పేమెంట్ కింద రూ.14,488 కోట్లు సెటిల్‌మెంట్ చేశారు. మొత్తంగా రూ.24,836 కోట్ల ఐజిఎస్‌టి నుంచి సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టిలకు బదిలీ చేశారు. కాగా జులైలో మొత్తంగా రూ.95,000 కోట్లు, ఆగస్టులో రూ.91,000 కోట్ల చొప్పున జిఎస్‌టి వసూళ్లు జరిగాయి. సెప్టెంబర్‌లో తిరిగి రూ.92,150 కోట్లు, అక్టోబర్‌లో రూ.83,000 కోట్ల చొప్పున నమోదయ్యాయి.
జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీన్నే తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ పరోక్ష పన్నును మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని హడావిడిగా అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో అటు వ్యాపారులకు ఇబ్బందికరంగా మారిన ఈ పన్ను వ్యవస్థ ఇటు ప్రభుత్వానికి చేదుగా మారింది. జీఎస్టీ మొదలయినప్పటి నుంచి ప్రభుత్వం ఆశించిన విధంగా పన్ను వసూళ్లు జరగడం లేదని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications