2020 నుంచి 2030 మధ్య కాలంలో ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉండబోతున్నాయో అనే అంశంపై ఈ కథనంలో వివరంగా ఇస్తున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో చదువులంటే ఎంపీసీ, బైపీసీ అనే విధంగా తయారయింది వ్యవస్థ. 10వ తరగతి పూర్తవ్వగానే ఎంపీసీ చదివి ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ విద్యలో చేరిపోవడం ఒక నిర్ధారిత మార్గం. ఇంక మహా అంటే 50వేల నుంచి 1 లక్ష మంది బైపీసీ వైపు మొగ్గు చూపుతారు. అంతే చదివితే ఇంజినీర్ అయిపోవాలి, లేదా డాక్టర్ అయిపోవాలి. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడని తల్లిదండ్రులు ఉన్నారంటే నమ్మక తప్పదు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఒక మూస ధోరణిలో సాగిన విద్యా వ్యవస్థతో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని యువత ఎక్కువ శాతం ఇంజినీరింగ్ చదివి కనీస నైపుణ్యాలు లేక ఏదో ఉద్యోగం చేస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండి కూడా సెక్యూరిటీ గార్డ్స్, కాల్ సెంటర్ ఉద్యోగాలు, బార్లు,పబ్బులు, రిసిప్షనిస్ట్‌లుగా ఉద్యోగాలు చేస్తున్న వారు లేకపోలేదు. ఇదంతా ఎందుకంటే పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలు మన వాళ్ల దగ్గర లేవు. మరో వైపు పరిశ్రమకు కావాల్సిన సరైన అభ్యర్థులను అందించే కళాశాలలు లేవు. ఈ క్రమంలో నిపుణుల కొరతతో బహుళ జాతి సంస్థలు సతమతమవుతున్నాయి. ఆకర్షణీయ వేతనాలు లేక యువతా నీరుగారిపోతోంది.
ఈ క్రమంలో వివిధ సంస్థలు భవిష్యత్ మార్గసూచీలపై అంచనాలు వెలువరిస్తున్నాయి. అలాగే 2020 నుంచి 2030 మధ్య కాలంలో ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉండబోతున్నాయో అనే అంశంపై ఈ కథనంలో వివరంగా ఇస్తున్నాం.

డిజిటల్ మార్కెటింగ్
దేశంలో 37 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. రాను రాను ఇంటర్నెట్ వాడే వారే సంఖ్య పెరగడమే కానీ తగ్గడం ఉండదు. దీంతో ఉత్పత్తుల ప్రమోషన్ కోసం కేవలం సంప్రదాయ ప్రకటనా మార్గాల మీద ఆధారపడితే అయ్యే పని కాదు. వచ్చే కొన్నేళ్లలో డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే కస్టమర్లను చేరుకోగలరు. అందుకే ఇప్పుడిప్పుడే చాలా రిటైల్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటనల కోసం ఆన్‌లైన్ మార్గాన్ని ఆశ్రయిస్తున్నాయి. అందుకే ఈ రంగంలో వచ్చే దశాబ్ద కాలంలో ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రానున్నాయి.
అయితే డిజిటల్ మార్కెటింగ్ ఆధారిత ఉద్యోగాలు చేయాలంటే కచ్చితంగా ఈ చదువే ఉండాలనేం లేదు.
డిగ్రీ అర్హత ఉంటే మంచిది. లేకపోయినా ఫర్వాలేదు. ఎన్నో సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి పూర్తి చేస్తే పూర్తి స్థాయి డిజిటల్ మార్కెటర్‌గా స్థిరపడొచ్చు.

ఈ-లెర్నింగ్
మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అంతే కాకుండా చదువు కోసం ఎక్కడికైనా పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. ఒకప్పుడు ఉన్న నగరం నుంచి ఎక్కడికో పంపితేనే చదవులు అబ్బేవి. ఇప్పుడు ఆ ఆలోచనకు కాలం చెల్లింది. తరగతి గదిలో నేర్చుకునే చదువుకు అదనంగా మరెంతో నేర్చుకోవడానికి వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇంటర్నెట్ ద్వారా పాఠాలు చెప్పడం, చెప్పించుకోవడం ఒకటి. తరగతి గదిలోనే పాఠాలు చెప్పే ఏర్పాట్లు చేయడం ఇటు ప్రభుత్వాలకు, అటు విద్యాసంస్థలకు కష్టమైన వ్యవహారం అయిపోయింంది. అందుకే ఇప్పట్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు సైతం ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నాయి.
ప్రభుత్వాలు సైతం ఈ-లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఐఐటీ ప్రొఫెసర్లు చెప్పే పాఠాలను దేశంలోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలకు అందుబాటులో ఉండే విధంగా సాంకేతిక ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ రంగాలపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అందులో అవసరాలకు అనుగుణంగా మన నైపుణ్యాలను తీర్చిదిద్దుకోగలిగితే అవకాశాలకు కొదవ ఉండదు.

డేటా అనలిటిక్స్
అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్, అనలిటిక్స్ ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం 2020 కల్లా భారతదేశ అనలిటిక్స్ పరిశ్రమ ఇప్పుడున్న దాని కంటే రెండింతలవుతుందని తేలింది. ఇప్పటికి 2.03 మిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఈ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 23.8% చొప్పున ఉండగలదని అంచనా వేశారు. అమెరికాకు చేసే అనలిటిక్స్ ప్రాజెక్టుల వల్ల మన దేశానికి 60% డేటా అనలిటిక్స్ రంగ రెవెన్యూ వస్తోంది. మిగిలిన దేశాల్లో యూకే వల్ల 8.4%, ఆస్ట్రేలియా, కెనడా వంటివి ఉన్నాయి. కేవలం భారతదేశంలో ఉండే కంపెనీల కారణంగా అనలిటిక్స్ పరిశ్రమకు వచ్చే ఆదాయం 4 శాతం వరకూ ఉండగలదు.
ఎం.ఏ మ్యాథమ్యాటిక్స్, ఎం.ఏ స్టాటిస్టిక్స్ చదివిన వారికి ఈ రంగంలో అపార అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏ డిగ్రీ చదివినా ఈ రంగానికి సంబంధించిన అవగాహనను పెంచుకున్నా అవకాశాలు వాటంతట అవే వస్తాయి.

సైబర్ సెక్యూరిటీ
ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతి ఇంటిలో మొబైల్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్, ఫ్యాబ్లెట్ లాంటి గ్యాడ్జెట్ల వాడకం పెరిగిపోయింది. వీటన్నింటిని వాడకానికి ఇంటర్నెట్ తప్పనిసరి. అయితే ఐటీ ఎంత పెరిగినా డేటా భద్రత గురించి ఉండే భయాలు ఉండనే ఉంటాయి. డేటా భద్రతలకు కంపెనీలు, ప్రభుత్వాలు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.
సాంకేతికత వల్ల సానుకూల అంశాలు ఉన్నట్లే హ్యాకింగ్, డేటా థెఫ్ట్ వంటి వాటి కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిదే. అభివృద్ది చెందిన దేశాలతో పాటు, అభివృద్ది చెందుతున్న దేశాల్లో సైతం హ్యాకింగ్, సైబర్ దాడులు నిత్యకృత్యమయ్యాయి.
దీన్ని లోతుగా చూస్తే సైబర్ సెక్యూరిటీకి రాగల రోజుల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. అయితే దానికి సంబంధించి పరిశ్రమ అంత వేగంగా సాంకేతికతను, కొత్త ఉద్యోగులను తీర్చిదిద్దలేకపోతున్నది. అందుకే ఈ రంగంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కనీస అవగాహనను పెంచుకుని పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా కోర్సులు చేస్తే మంచి వేతనాలతో ఉద్యోగాల్లో స్థిరపడగలరు.

మొబైల్ యాప్ డెవలపర్స్
దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అందులో స్మార్ట్ ఫోన్లు వాడే వారు సగానికి పైగా ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రంగాల్లో మొబైల్ ఫోన్లు, విడి భాగాల తయారీ, యాప్ డెవలప్‌మెంట్ ఒకటి. వచ్చే రెండు సంవత్సరాల్లో ఇంటర్నెట్ కలిగిన స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య 50 కోట్లను మించుతుందని అంచనా.
ఇలా మొబైల్ ద్వారా సేవలు పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం అయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వినియోగదారుడి అభిరుచికి తగ్గట్లుగా మంచి ఉత్పత్తులను తయారీ చేయగల టెక్కీలకు ఐటీ కంపెనీలు ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతున్నాయి.
వినూత్న మొబైల్ యాప్‌లను తయారు చేసే వారికి ప్రారంభ దశలోనే రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఇవ్వజూపుతున్నారు. ఇంకా అనుభవం కలిగిన వారికి రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ వేతనాలు ఉంటాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications