కర్ణాటక రాష్ట్రంలో ఐటీ ఉద్యోగ సంఘాల ఏర్పాటు కుదరదు
గత ఏడాది కాలంలో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇష్టానుసారం ఉద్యోగులను తొలగిస్తుండటంతో ఐటీ ఉద్యోగులు సైతం యూనియన్లు ప్రారంభించేందుకు యోచన చేశారు. ఆ పరిస్థితుత్లో కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ సైతం యూని
గత ఏడాది కాలంలో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇష్టానుసారం ఉద్యోగులను తొలగిస్తుండటంతో ఐటీ ఉద్యోగులు సైతం యూనియన్లు ప్రారంభించేందుకు యోచన చేశారు. ఆ పరిస్థితుత్లో కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ సైతం యూనియన్ల ప్రారంభానికి అవసరమైన మార్పులను ప్రభుత్వం చేపడుతుందని తెలిపింది. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.
ప్రస్తుతం కంపెనీలు ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, గూగుల్ వంటివి నూతన నియామకాలు చేపడుతున్నందున ఐటీ పరిశ్రమలో పరిస్థితులు చక్కబడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ చెబుతోంది. అంతే కాకుండా ఐటీ-బీటీ యాక్ట్ సవరించి యూనియన్ల ఏర్పాటు చేసే విధంగా ఉండాలంటే, ఐటీ చట్టానికి సవరణలు చేయాలి. ఆ మార్పులు చేయడం కాస్త కష్టమైన అంశమని ఐటీ శాఖా మంత్రి ప్రియాంక ఖర్గె చెప్పారు.

అంతే కాకుండా కంపెనీలు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలను అభివృద్ది పరచడంలో నిమగ్నమయ్యాయని ఐటీ-బీటీ శాఖ కార్యదర్శి గుప్తా అన్నారు. ఐటీ కంపెనీల్లో అప్పట్లో నెలకొన్న స్తబ్ధత దూరమై భారీగా నియమాకాలు జరుగుతున్న తరుణంలో యూనియన్ల ఏర్పాటు అవసరం లేదని ఆయన జోస్యం చెప్పారు. ఇందువల్ల ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటు అవసరం లేదన్నట్లు చెప్పారు.
అయితే వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా ఉన్నాయి. ఇటీవలే వెరిజోన్ అనే ఐటీ సంస్థ 3 నగరాల్లో దాదాపు 2000 మంది ఉద్యోగులను ఉన్న పళాన తొలగించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉద్యోగులను హఠాత్తుగా తొలగించనట్లు తెలియజేయగానే వారు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖను ఆశ్రయించారు. ఇంకా చెన్నై, పుణె నగరాల్లో ఇప్పటికే పలువురు సీనియర్ ఉద్యోగులు యూనియన్ల కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో బెంగుళూరులో ఐటీ యూనియన్ల ఏర్పాటు కష్టమని చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications