For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుజ‌రాత్ రాష్ట్ర ఆధారిత షేర్ల‌కు జోష్

సొంత రాష్ట్ర వ్య‌క్తి దేశ ప్ర‌ధానిగా ఉండ‌టంతో పాటు, అభివృద్దికి ప‌ట్టం క‌ట్టే పార్టీ కావ‌డంతో గుజ‌రాత్ రాష్ట్రంలో వ‌రుస‌గా ఆరు సార్లు భాజపా జైత్ర‌యాత్ర‌తో స్టాక్ మార్కెట్ల‌కు జోష్ వ‌చ్చింది.

|

సొంత రాష్ట్ర వ్య‌క్తి దేశ ప్ర‌ధానిగా ఉండ‌టంతో పాటు, అభివృద్దికి ప‌ట్టం క‌ట్టే పార్టీ కావ‌డంతో గుజ‌రాత్ రాష్ట్రంలో వ‌రుస‌గా ఆరు సార్లు భాజపా జైత్ర‌యాత్ర‌తో స్టాక్ మార్కెట్ల‌కు జోష్ వ‌చ్చింది. దీంతో పాటు ఇక గుజ‌రాత్ రాష్ట్రానికి సంబంధించిన కంపెనీల‌కు తిరుగు ఉండ‌ద‌న్న అభిప్రాయంతో ఆ రాష్ట్రంతో సంబంధం ఉన్న స్టాక్్‌ల‌ను కొనేందుకు మ‌దుప‌ర్లు మొగ్గుచూప‌డంతో గుజ‌రాత్ సంస్థ‌ల షేర్లు పైకి ఎగిసాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చరిష్మాతోనే గుజ‌రాత్లో భాజ‌పా విజ‌యం సాధ్య‌మైంద‌న్న ప్ర‌చారం బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డంతో ఇన్వెస్ట‌ర్లు చాలా సానుకూలంగా గుజ‌రాత్ రాష్ట్ర సంబంధిత షేర్ల‌ను కొనేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.

గుజ‌రాత్ రాష్ట్ర షేర్లు లాభాల్లో

ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి, ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెల్ల‌డైన క్ర‌మంలో సైతం పెట్టుబ‌డిదారులు, మ‌దుప‌ర్లు గుజ‌రాత్‌తో సంబంధం ఉన్న షేర్ల విష‌యంలో అతి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తు వ‌స్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ గ‌త వారంలో భాజ‌పా విజ‌యాన్ని అంచ‌నా వేసిన క్ర‌మంలోనే ఇన్వెస్ట‌ర్లు మొత్తం స్టాక్ మార్కెట్ల ప‌ట్ల ఆశావ‌హంగా క‌దిలారు. ఆ స‌మ‌యంలో దేశీయ ఈక్విటీ సూచీలు వ‌రుస రెండు సెష‌న్ల‌లో 0.66% లాభ‌ప‌డ్డాయి.
గుజ‌రాత్ బేస్‌డ్ లిస్టెడ్ సంస్థ‌ల షేర్ల తీరు ఇలా ఉంది
అదానీ పోర్ట్స్ అండ్ స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ లిమిటెడ్ - 2.35%
గుజ‌రాత్ స్టేట్ ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ - 0.42%
గుజ‌రాత్ న‌ర్మ‌దా వాలీ ఫెర్టిలైజ‌ర్స్ అండ్
కెమిక‌ల్స్ లిమిటెడ్ - 0.20%
అర్వింద్ లిమిటెడ్ - 0.16%
టొరెంట్ ప‌వ‌ర్ లిమిటెడ్ - 0.00%
టొరెంట్ ఫార్మాస్యుటిక‌ల్స్ లిమిటెడ్ - 1.27%
క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ - 1.95%
సింటెక్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ - (-2.58%)
అలెంబిక్ ఫార్మాస్యుటిక‌ల్స్ లిమిటెడ్ - (-0.02%)
గుజ‌రాత్ గ్యాస్ లిమిటెడ్ -0.18%
మొత్తం మీద సింటెక్స్, అలెంబిక్ కంపెనీలు త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ మంచి లాభాల‌ను ద‌క్కించుకున్నాయి.

Read more about: gujarat companies
English summary

గుజ‌రాత్ రాష్ట్ర ఆధారిత షేర్ల‌కు జోష్ | These 15 Gujarat stocks that have soared for 5 years have a lot at stake

Gujarat-linked stocks, many of which have delivered handsome returns to investors over the past five years, were in focus in Monday’s trade, as Dalal Street weighed possible implications of the political outcome.
Story first published: Monday, December 18, 2017, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X