For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, పేమెంట్ల రంగంలోకి జియోమి

దేశంలో 90 ల‌క్ష‌ల స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాల‌ను చేప‌ట్టిన‌ చైనా కంపెనీ జియోమి మరో ప్ర‌ణాళిక‌తతో భార‌త్‌లో విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా ఇనుమ‌డింప చేసేందుకు భారీ ప్రణ

|

దేశంలో 90 ల‌క్ష‌ల స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాల‌ను చేప‌ట్టిన‌ చైనా కంపెనీ జియోమి మరో ప్ర‌ణాళిక‌తతో భార‌త్‌లో విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా ఇనుమ‌డింప చేసేందుకు భారీ ప్రణాళికలు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయం, పేమెంట్‌ బ్యాంక్‌ సేవలను ప్రారంభించడానికి యోచిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్‌ నివేదించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కార్లు విక్రయాలతో పాటు రుణాలు ఇవ్వడం లాంటి ఇతర ఫైనాన్సింగ్‌ సేవలను అందించనుందనీ ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ ఫైలింగ్‌లో తెలిపిందని పేర్కొంది.

 కొత్త రంగాల్లో వ్యాపారానికి జియోమి సిద్దం

ఆర్‌ఓసీలో జియోమి దాఖలు చేసిన వివరాల ప్రకారం, అన్ని రకాల వాహానాలు (ఎలక్ట్రికల్‌ వాహనాలతో సహా) రవాణ పరికరాలు, ఇతర రవాణా సామగ్రి, విడిభాగాలను సరఫరా చేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, పేమెంట్‌ బ్యాంకు, లీజింగ్‌ అండ్‌ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవలు, పేమెంట్‌ గేట్‌ వే, సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, మొబైల్ వర్చ్యువల్ నెట్‌వర్క్‌ ఆపరేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది.

జియోమి కంపెనీకి స్మార్ట్ ఫోన్ల అమ్మ‌కాల‌కు సంబంధించి సొంత దేశం చైనా త‌ర్వాత భార‌తే అతిపెద్ద మార్కెట్. దీంతో కేవ‌లం స్మార్ట్‌ఫోన్ల త‌యారీకే ప‌రిమితం కాకుండా మ‌రిన్ని రంగాల్లోకి విస్త‌రించాల‌ని ఆ కంపెనీ యోచిస్తోంది. ఆ కంపెనీ చైనాలో ల్యాప్‌ట్యాప్‌లు, టీవీలు, స్మార్ట్ లైటింగ్ ప‌రిక‌రాలు, వైద్య‌ ప‌రిక‌రాలు, ఎల‌క్ట్రిక్ బైక్‌, గృహోప‌క‌ర‌ణాలు, చెప్పులు, బూట్లు, బ్యాగులు, బొమ్ముల వంటి వాటి తయారీలో ఉంది.
ఇప్పుడు వ‌స్తున్న నివేదిక‌ల ప్రకారం జియోమి చైనాలో ఐపీవోకు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న‌దాని కంటే భిన్నంగా చొచ్చుకుపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఆ సంస్థ‌కు భార‌త వినియోగ‌దారు మార్కెట్లో మంచి స్పంద‌న వ‌చ్చే అవ‌కాశ‌మే ఉన్న‌ది.

Read more about: xiaomi mobiles
English summary

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, పేమెంట్ల రంగంలోకి జియోమి | xiaomi to enter into electric vehicles, payment bank sectors in India

Xiaomi is on a roll. After selling 90 lakh smartphones every quarter in India and sharing the top spot Samsung, the Chinese company is now eyeing the electric vehicles and payments bank business in India, reports The Economic Times.
Story first published: Tuesday, December 12, 2017, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X