వీడియో నిర్వహణ సంస్థ యూట్యూబ్ కొత్తగా పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. వీళ్లు చేయాల్సిన పనేంటో తెలుసా? సమస్యాత్మక వీడియోలను సమీక్షించడం.
వీడియో నిర్వహణ సంస్థ యూట్యూబ్ కొత్తగా పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. వీళ్లు చేయాల్సిన పనేంటో తెలుసా? సమస్యాత్మక వీడియోలను సమీక్షించడం. అందులో ఉన్న హింసాత్మక, రెచ్చగొట్టే, అభ్యంతకర వీడియోలను తొలగించడం, నియంత్రించడం. అంతేకాదు పిల్లలను చెడుదోవ పట్టించే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం. చాలా మంది యూట్యూబ్‌ను అడ్డంగా పెట్టుకొని నెటిజన్లను తప్పుదోవ పట్టించడం, హింసించడం చేస్తున్నారని ఆ సంస్థ సీఈవో సుసాన్ వోజికి అన్నారు. తమ విధానాలకు విరుద్ధంగా యూట్యూబ్‌లో లోడ్ అవుతున్న ఇలాంటి వీడియోల ఆట కట్టించడానికి వచ్చే ఏడాది పది వేలకు పైగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు సుసాన్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ రకమైన వీడియో నిర్వహణకు సంబంధించి ఎంత మంది పనిచేస్తున్నారో ఆమె వెల్లడించడం లేదు.

ఇక రెచ్చగొట్టే కామెంట్లపైనా దృష్టిసారించామని, అందుకే కొత్తగా కామెంట్ మోడరేషన్ టూల్స్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే అసలు కామెంట్స్ సెక్షనే క్లోజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంచేశారు. యూట్యూబ్ తన తాజా మార్గదర్శకాల ప్రకారం 50 చానెల్స్‌తోపాటు కొన్ని వేల వీడియోలను తొలగించింది. యూట్యూబ్‌లో వస్తున్న సమాచారాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్నదంటూ కొంత కాలంగా అడ్వర్‌టైజర్లు, రెగ్యులేటర్స్ సంస్థను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇథియాడ్ ఎయిర్‌వేస్, మారియట్, డెలివరో వంటి సంస్థలు తమ వీడియోలను తొలగించాయి. ఎందుకంటే తమ వీడియోల పక్కనే వాటిని విమర్శిస్తూ తయారుచేసిన వీడియోలు ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం. ప్రకటదారుల హక్కులను కాపాడుతూ, వారు ప్రశాంతంగా ప్రకటనలు ఇచ్చేలా చూడటమే తమ లక్ష్యమని సుసాన్ వెల్లడించారు.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications