ఇన్ఫోసిస్ నూతన సారథిగా సలీల్ సతీష్ పరేఖ్
ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవోగా సలీల్ ఎస్.పరేఖ్ నియమితులయ్యారు. జనవరి 2,2018 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఐదు సంవత్సరాల కాలానికి ఆయన సీఈవోగా ఉంటారని కంపెనీ తెలిపి
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవోగా సలీల్ ఎస్.పరేఖ్ నియమితులయ్యారు. జనవరి 2,2018 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఐదు సంవత్సరాల కాలానికి ఆయన సీఈవోగా ఉంటారని కంపెనీ తెలిపింది.

పరేఖ్ ఇదివరకూ క్యాపిజెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీలను పూర్తిచేశారు. బొంబాయి ఐఐటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బీ.టెక్ విద్యను అభ్యసించారు. ఈ నియమాకంపై ప్రస్తుత ఛైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ "సలీల్ పరేఖ్‌ను ఇన్ఫోసిస్ సీఈవోగా,ఎండీగా నియమించుకోవడాన్ని సంతోషకరంగా భావిస్తున్నాం. అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో అతనికి 3 దశాబ్దాల అనుభవం ఉంది. బిజినెస్ కార్యకలాపాలు చక్కపెట్టడంలోనూ, ఇతర సంస్థలను చేజిక్కుంచుకోవడంలోనూ ఆయనకు మంచి అనుభవం ఉంది. దీంతో ఈ పరిశ్రమలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థకు సారథ్యం వహించగల వారిలో ఆయన్ను సరైన వ్యక్తిగా భావిస్తున్నాం.'' అని చెప్పారు. ప్రస్తుతం సలీల్ ఎస్.పరేఖ్ (సలీల్ సతీష్ పరేఖ్) వయసు 53. ఐగేట్ కంపెనీని 2015లో క్యాప్ జెమినీ చేజిక్కించుకోవడంలో పరేఖ్ ముఖ్య పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications