బ్యాంకుల్లో డిపాజిట్ దారుల డబ్బుకు ఆర్థిక రక్షణా!
కొంత మంది చెబుతున్నట్లు ఇకపై డిపాజిటర్ల డబ్బుకు పెద్దగా రక్షణ లేదన్నట్లు వస్తున్న వదంతులను బ్యాంకర్లు, నిపుణులు కొట్టిపడేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ఫైనాన్సియల్ రెజల్యూషన్ అండ్ డి
కొంత మంది చెబుతున్నట్లు ఇకపై డిపాజిటర్ల డబ్బుకు పెద్దగా రక్షణ లేదన్నట్లు వస్తున్న వదంతులను బ్యాంకర్లు, నిపుణులు కొట్టిపడేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ఫైనాన్సియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లును ప్రవేశపెడుతున్నది. దీంతో చాలా మందిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొంత మంది దాని గురించి విశ్లేషించి చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే బ్యాంకులు అప్పుల్లో మునిగితే దాన్ని డిపాజిట్ల డబ్బుతో కప్పిపుచ్చుతారని, దీంతో డిపాజిటర్ల డబ్బుకు ఆర్థిక రక్షణ ఉండదని.

ఈ బిల్లు ప్రకారం ఒక భావన ''బెయిల్ -ఇన్'' పేరిట ఉంది. దీని అర్థం ఏమిటంటే బ్యాంకు సొంత డబ్బు, అంటే డిపాజిటర్ల సొమ్మును రుణ గ్రహీతల దివాలా స్థితి వల్ల బెయిల్ అవుట్ అయిన బ్యాంకును దారిలోకి తీసుకొచ్చేందుకు వినియోగిస్తారు. దీంతో చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడుతున్నారు. మామూలుగా అయితే ప్రతి డిపాజిట్‌కు సంబంధించి గరిష్టంగా రూ.1 లక్ష వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఈ బిల్లు వచ్చిన తర్వాత దీనికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదనేది వాస్తవమని బ్యాంకర్లు అంటున్నారు. డిపాజిట్ సొమ్ముకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆర్థిక రక్షణ ఉంటుందని బిల్లుకు సంబంధించి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకు డిపాజిట్లపై ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది.. అసలు ఎఫ్ఆర్‌డీఐ బిల్లులో ఏముంది?
ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం అయితే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ డిపాజిటర్లు, హక్కుదార్లతో కూడిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్యాంకు దివాలా తీసినప్పుడు పరిష్కారం చూపుతోంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న చట్టంకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు సైతం డిపాజిటర్ల సొమ్ము రక్షణ గురించి చెబుతున్నది. చట్టం సూచించిన సొమ్మును లేదా బ్యాంకులు డిపాజిట్‌దారులకు బకాయి పడిన సొమ్మును కార్పొరేషన్ చెల్లిస్తుంది. ఈ చెల్లింపుల కోసం ఇన్సూరెన్స్ ఫండ్‌ను ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications