బ్యాంకు డిపాజిట్లు భ‌ద్ర‌మేనా

“బ్యాంకుల్లో ఉన్న మీ డ‌బ్బు ఈ విధంగా పోతుంది” అనే పేరుతో వాట్సాప్ మెసేజ్ ప్లాట్ ఫారంలో ఒక సందేశం వైర‌ల్ అవుతోంది. దీంతో డిపాజిట్‌దార్ల‌లో ఒక విధ‌మైన భ‌యం చెల‌రేగుతోంది. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో కేవ‌ల

ఒక వైపు ఆర్థిక శాఖ, మ‌రో వైపు ఆర్థిక మంత్రి బ్యాంకు డిపాజిట్ల‌కు సంబంధించి బిల్లులో మార్పుల కార‌ణంగా డిపాజిట్లు సుర‌క్షితం కాద‌న్న వాద‌న‌ను కొట్టిపారేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్థిక శాఖ గురువారం వెలువ‌రించిన ప్ర‌క‌ట‌న‌లో నూత‌న బిల్లులో బ్యాంకుల‌పై ప్ర‌భుత్వ అజమాయిషీ త‌గ్గ‌బోద‌ని, ఇంకా బ్యాంకుల‌ను సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు, వాటికి త‌గిన నిధులు స‌మ‌కూర్చ‌డానికి ప్ర‌భుత్వానికి అవ‌కాశం క‌లుగుతుంద‌ని తెలిపింది. బ్యాంకుల‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కాన్ని కోల్పోన‌క్క‌ర్లేద‌ని ఆర్థిక శాఖ వెలువ‌రించిన ప్ర‌క‌ట‌న సారాంశం.ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న ఎఫ్‌డీఆర్ఐ బిల్లు, దాని వ‌ల్ల డిపాజిట్ల‌పై ప్ర‌భావం ఉంటుందా.. లేదా తెలుసుకుందాం.

1. ఎఫ్‌డీఆర్ఐ బిల్లు అంటే ఏమిటి?

1. ఎఫ్‌డీఆర్ఐ బిల్లు అంటే ఏమిటి?

చాలా మందిలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు ఈ ఎఫ్‌డీఆర్ఐ బిల్లును కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆధ్వ‌ర్యంలోని ఈ ప్ర‌భుత్వ‌మే తీసుకురాలేదు. జీ20 దేశాలు అన్నీ క‌లిసి మ‌ద్ద‌తు తెలుపుతున్న ఫైనాన్సియ‌ల్ స్టెబిలిటీ బోర్డు ప్ర‌తిపాద‌న‌లో భార‌త్ కూడా ఒక స‌భ్య దేశ‌మే. ఇందులో ఆర్ఘిక సంస్థ‌లు గ‌ట్టిగా నిల‌బ‌డాలంటే ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలో తెలిపి ఉంటుంది. ఆ సూచ‌నల్లో పెద్ద బ్యాంకులు డీఫాల్ట్ అయితే ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో తెల‌ప‌డంతో పాటుగా, బెయిల్ ఇన్ ప్రొవిజ‌న్ ఉంటుంది.

దాని ప్ర‌కారం దేశంలో 2009లో ఫైనాన్సియ‌ల్ స్టెబిలిటీ బోర్డు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2008లో అమెరికాలో పెద్ద బ్యాంకులు విఫ‌ల‌మై అంత‌ర్జాతీయ ఆర్థిక సంక్షోభం త‌లెత్తిన త‌ర్వాత చాలా మార్పులు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో బ్యాంకుల‌ను కాపాడేందుకు ప‌న్ను చెల్లింపుదార్ల డ‌బ్బులు వాడుకోవాల్సి వ‌చ్చింది. దీన్ని నివారించేందుకు ఒక ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ అనివార్య‌మైంది.

ఈ బిల్లు ప్ర‌కారం సంక్షోభ స‌మ‌యంలో ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాలి.

ఆర్థిక సంక్షోభ నివార‌ణ కొర‌కు ప‌ట్టే స‌మ‌యం, ఖ‌ర్చు సంబంధించి నిర్దిష్ట మార్గ సూచి ఉంటుంది. ఏడాది లోపే ఆర్థిక సంక్షోభాన్ని త‌గ్గించే చర్య‌లు చేప‌ట్టాలి.

2. ఎందుకింత ఆందోళ‌న‌.

2. ఎందుకింత ఆందోళ‌న‌.

దేశంలో బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్న‌ప్పుడు బాధ్య‌త ఎవ‌రిద‌నే సందేహం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో ఉంటుంది. దేశంలో బ్యాంకుల‌న్నింటికీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐనే. ఇన్ని రోజులు దేశంలో బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల వ్య‌వ‌హారాల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ప‌ర్య‌వేక్షిస్తూ వ‌చ్చింది. అవి సంక్షోభంలో చిక్కుకున్న‌ప్పుడు దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను అదే స్థాయిలో ఆర్బీఐ చేప‌డుతూ వ‌చ్చింది. అందుకే 2008 సంవ‌త్స‌రంలో దేశ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌లు ఆ స్థాయిలో న‌మ్మ‌కం పెంచుకున్నారు. ఇప్ప‌టికీ దేశంలో ఎక్కువ మంది పొదుపు కోసం బ్యాంకు డిపాజిట్ల పైనే ఆధార‌పడుతుంటారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చే ఎఫ్ఆర్డీఐ బిల్లు ఆర్బీఐ అధికారాల‌ను ప‌రిమితం చేస్తుంద‌ని కొన్ని బ్యాంకింగ్ వ‌ర్గాలే వాపోతున్నాయి.

3. బెయిల్ ఇన్ క్లాజ్ ఏమిటి?

3. బెయిల్ ఇన్ క్లాజ్ ఏమిటి?

ప్ర‌స్తుతం ఎఫ్ఆర్‌డీఐ బిల్లు పార్ల‌మెంంట‌రీ క‌మిటీ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ నెల‌లో జ‌రిగే పార్ల‌మెంటు స‌మావేశంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టిదాకా డీఐసీజీసీ అనే ఆర్బీఐ ఆధ్వ‌ర్యంలోని సంస్థ మాత్ర‌మే డిపాజిట్ల ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల‌ను చూస్తోంది. డిపాజిట్‌దారుల త‌ర‌పున ప్ర‌తి డిపాజిట్‌పైన కొంత సొమ్మును ప్ర‌తి బ్యాంకు ఈ కార్పొరేష‌న్‌కు చెల్లిస్తుంది. అనుకోని ప‌రిస్థితుల్లో బ్యాంకు దివాలా తీస్తే ప్ర‌తి డిపాజిటరుకు గ‌రిష్టంగా రూ.1 ల‌క్ష చెల్లించే ఏర్పాటును ఈ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ చేసింది. అయితే ఒక‌సారి ఇప్పుడు వార్త‌లో ఉన్న కొత్త బిల్లు చ‌ట్ట‌రూపం దాలిస్తే డీఐసీజీసీ అవ‌స‌రం ఉండ‌దు. కొత్త‌గా రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ తెర‌పైకి వ‌స్తుంది. దివాలా తీసే బ్యాంకును, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న బ్యాంకును ఈ రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ త‌న ఆధీనంలోకి తీసుకుంటుంది. డిపాజిట్ల ర‌క్ష‌ణ‌, బ్యాంకును సంక్షోభంలో నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌టం వంటి వ్య‌వ‌హారాల‌ను ఇదే చూస్తుంది. అంటే ప్ర‌తి డిపాజిట్ ర‌క్ష‌ణ ప‌క్క‌న‌బెట్టి ఏకమొత్తంగా బ్యాంకుల‌కు ఉన్న నిరర్ద‌క ఆస్తులు లేదా వ‌సూలు కానీ రుణాల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంటుంది.

4. రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ అంటే ఏమిటి.. ?

4. రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ అంటే ఏమిటి.. ?

ఎఫ్‌డీఆర్‌బీఐ బిల్లులో అన్నింటి కంటే ప్ర‌ధాన అంశం రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్.

బ్యాంకు లేదా కార్పొరేష‌న్ విఫ‌ల‌మైన సంద‌ర్బంలో మొత్తం వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి ఏర్ప‌డే కొత్త సంస్థే ఇది.

ఆయా సంస్థ‌ల రిస్క్ స్థాయిని అనుసరించి ఇది వాట‌న్నింటినీ ఒక్క గ్రూపుగా చేస్తుంది.

రిస్క్ స్థాయిల ఆధారంగా త‌క్కువ‌, మ‌ధ్య‌స్థ‌, మెటీరియ‌ల్‌; ఇమ్మినెంట్్‌, తీవ్ర రిస్క్ వంటి వ‌ర్గాలుగా విభ‌జిస్తారు.

ఏడాది లోపు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ‌లో తలెత్తిన సంక్షోభాన్ని ప‌రిష్క‌రిస్తుంది.

రెండు సంస్థ‌ల‌ను క‌ల‌ప‌డం, ఒక దాన్ని మ‌రోదానిలో విలీనం చేయ‌డం, ఆస్తుల‌ను బ‌ద‌లాయించ‌డం వంటి ప‌నుల‌ను చేస్తుంది.

స‌మ‌స్య‌ల్లో ఉన్న సంస్థ ఉద్యోగుల‌ను త‌గ్గించ‌డం, వేరే సంస్థ‌కు పంపించ‌డం, ఉద్యోగుల జీతాల‌ను త‌గ్గించ‌డం వంటి ప‌రిష్కారాల‌ను క‌నుగొంటుంది. రెండేళ్ల త‌ర్వాత సంస్థ‌ను పూర్తిగా మూసివేసే ఆలోచ‌న‌ను అమలు ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తుంది.

 5. ప్ర‌స్తుతం ఉన్న డీఐసీజీసీ, రాబోతున్న రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ సంస్థ‌కు తేడాలు ఏమిటి?

5. ప్ర‌స్తుతం ఉన్న డీఐసీజీసీ, రాబోతున్న రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ సంస్థ‌కు తేడాలు ఏమిటి?

ఇప్ప‌టి దాకా బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఏదైనా సంక్షోభం తలెత్తితో వాటి ప‌రిష్కారాల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్, ఐఆర్‌డీఏఐ చూస్తున్నాయి.

డిపాజిట్ దారుల‌, ఉద్యోగుల ప్ర‌యోజ‌నాల‌ను రక్షించేందుకు తాకట్టులో ఉన్న సంక్షోభానికి కార‌ణ‌మైన ఆస్తుల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు త‌న చేతుల్లోకి తీసుకునేందుకు ఆర్బీఐ అనుమ‌తిస్తుంది.

డీఐసీజీసీ అనే సంస్థ గ‌రిష్టంగా డిపాజిటర్ల‌కు రూ.1 ల‌క్ష వ‌ర‌కూ చెల్లింపు జ‌రిగేలా చూస్తుంది.

బ్యాంకు దివాలా తీస్తే డిపాజిట్ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్(డీఐసీజీసీ) డిపాజిట్‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతుంది.

ఇప్పుడు ప్ర‌తిపాదించిన బిల్లు ప్ర‌కారం, డీఐసీజీసీ అనే సంస్థ‌ను పూర్తిగా తొల‌గించి కొత్త‌గా రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తారు.

 6.ఆయా బ్యాంకుల లేదా ఆర్థిక సంస్థ‌ల ఆస్తుల అమ్మ‌కాలు ఎలా చేస్తారు

6.ఆయా బ్యాంకుల లేదా ఆర్థిక సంస్థ‌ల ఆస్తుల అమ్మ‌కాలు ఎలా చేస్తారు

సమస్య‌లో ఉన్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు సంబంధించిన వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు ఈ విధంగా చేస్తారు.

1. మొద‌ట బీమా క‌లిగిన డిపాజిట్ దారుల‌కు రెజ‌ల్యూష‌న్ కార్పొరేష‌న్ సొమ్ము చెల్లిస్తుంది.

2. స‌మ‌స్య ప‌రిష్కారానికి అయ్యే ఖ‌ర్చుల‌న్నింటీనీ బేరీజు వేస్తుంది.

3. అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌కు 24 నెల‌ల పాటు వేత‌నాల చెల్లింపును ప‌ర్య‌వేక్షిస్తుంది.

4. డిపాజిట్ బీమా క‌లిగిలేని డిపాజిటర్ల‌కు సొమ్ము చెల్లింపులను చేస్తుంది.

5. అన్ సెక్యూర్డ్ క్రెడిటార్ల చెల్లింపుల‌ను చేస్తుంది.

6. ప్ర‌భుత్వానికి ఉన్న అప్పుల‌ను, సెక్యూర్డ్ క్రెడిటార్ల చెల్లింపుల‌ను చేప‌డుతుంది.

7. మిగిలిన అప్పుల‌ను, చేయాల్సిన చెల్లింపుల‌ను చేస్తుంది.

8. చివ‌ర‌గా వాటాదారుల హ‌క్కుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

 7.సెక్ష‌న్ 52

7.సెక్ష‌న్ 52

దేశంలో ఎన్నో ప్రైవేటు బ్యాంకులు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌పైన క‌స్ట‌మ‌ర్లు న‌మ్మ‌కం ఉంచారు. అందుకే ఎక్కువ‌గా సీనీయర్ సిటిజ‌న్లు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు. వ‌డ్డీ త‌క్కువ ఉన్న స‌మయాల్లో సైతం సుర‌క్షితంగా ఉంటాయ‌నే నెపంతో చాలా మంది గ‌వ‌ర్న‌మెంట్ బ్యాంకుల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు.

అయితే బెయిల్ ఇన్ క్లాజ్ కార‌ణంగా అన్ సెక్యూర్డ్ రుణ గ్ర‌హీత‌ల‌తో స‌హా, అంద‌రూ డిపాజిట్‌దారులు, రుణ గ్ర‌హీత‌లు, బ్యాంకు నష్టాల‌కు సంబంధించి ప్ర‌తి డిపాజిట్‌దారు స‌మాన బాధ్య‌త వ‌హించాలి.

ఎఫ్‌డీఆర్‌ఐ బిల్లులో ప్ర‌ధానంగా సెక్ష‌న్ 52 ఉంటుంది. ఇప్పుడు కొత్త చ‌ట్టంలో దీన్ని అడ్డం పెట్టుకొని డిపాజిట్ దారుల‌కు సంబంధించిన రూ.1 ల‌క్ష ఇన్సూరెన్స్‌ను ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంది.

 8.ఇప్పుడు అంద‌రిలో ఉన్న భ‌యం ఏమిటి?

8.ఇప్పుడు అంద‌రిలో ఉన్న భ‌యం ఏమిటి?

"బ్యాంకుల్లో ఉన్న మీ డ‌బ్బు ఈ విధంగా పోతుంది" అనే పేరుతో వాట్సాప్ మెసేజ్ ప్లాట్ ఫారంలో ఒక సందేశం వైర‌ల్ అవుతోంది. దీంతో డిపాజిట్‌దార్ల‌లో ఒక విధ‌మైన భ‌యం చెల‌రేగుతోంది. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో కేవ‌లం కొన్ని నోట్ల‌నే ర‌ద్దు చేశారు. ఇప్పుడు ఏకంగా మ‌న డ‌బ్బు మొత్తం పోతుంద‌నే మెసేజ్ ఇప్పుడు ఎక్కువ‌గా అన్ని చోట్లా తిరుగుతోంది. కొత్త బిల్లు ప్ర‌కారం సామాన్య డిపాజిట‌ర్ ర‌క్ష‌ణ గాలిలో దీపం అవుతుంద‌నే ఎక్కువ మంది న‌మ్ముతున్నారు. అయితే ఆర్థిక శాఖ మాత్రం దీనికి భిన్నంగా వాదిస్తోంది.

9. ఆర్థిక శాఖ చెబుతున్న‌దేమిటి?

9. ఆర్థిక శాఖ చెబుతున్న‌దేమిటి?

బ్యాంకుల‌కు మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో ప్ర‌భుత్వ పాత్ర ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌గ్గ‌బోదు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల విష‌యంలో సైతం ప్ర‌భుత్వ పాత్ర త‌గ్గ‌దు. ఎటువంటి క‌ష్టం వ‌చ్చినా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ఆదుకునే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. ప్ర‌స్తుతానికి ఎఫ్‌డీఆర్‌బీఐ బిల్లు ఉమ్మ‌డి పార్లమెంట‌రీ సంఘం ప‌రిశీల‌న‌లో ఉంది. ఆ సంఘం అంద‌రు భాగ‌స్వాముల నుంచి సూచ‌న‌ల‌ను స్వీక‌రిస్తోంది.

 10. మొత్తానికి సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం ప‌డుతుంది?

10. మొత్తానికి సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం ప‌డుతుంది?

ఖాతాదారుల సొమ్ము పూర్తి భ‌ద్రంగా ఉంటుంద‌ని, ఇప్పుడు ఉన్న ఆర్థిక ర‌క్ష‌ణ కంటే క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల‌కే ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను సైతం కాపాడేందుకు ఉప‌యోగ‌ప‌డే ప్ర‌తిపాద‌న‌లు చ‌ట్టంలో ఉన్నాయ‌ని అరుణ్ జైట్లీ వివ‌రించారు. అయితే బ్యాంక‌ర్లు, ఆర్థిక నిపుణులు చేస్తున్న వాద‌న మ‌రోలా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం రూ.1 ల‌క్ష డిపాజిట్ వ‌ర‌కూ భ‌ద్ర‌త ఉండేది . కొత్త బిల్లులోనైతే ఏ మేర‌కు డిపాజిట్ల సొమ్ముకు బీమా సౌక‌ర్యం ఉంటుంద‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+