డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు, పెద్ద మొత్తాల్లో చేసే డిపాజిట్లపై ఒక శాతం మేర వడ్డీ రేట్లను ఒక శాతం(100 బేసిస్ పాయింట్లు) పెంచింది. కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు, పెద్ద మొత్తాల్లో చేసే డిపాజిట్లపై ఒక శాతం మేర వడ్డీ రేట్లను ఒక శాతం(100 బేసిస్ పాయింట్లు) పెంచింది. కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత ఈ తరహా డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్‌బీఐ సవరించింది. దీని ప్రకారం కనీసం రూ.1 కోటి లేదా ఆపై మొత్తాల్లో చేసే డిపాజిట్లకు ఇకపై 1% వడ్డీ అదనంగా లభిస్తుంది. గత ఏడాది కాలంగా ఇతర బ్యాంకులు ఆర్థిక సంస్థలు కంపెనీలు నిల్వ ఉంచే అధిక నిల్వలకు ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో కేవలం సంవత్సరం కాలంలో ఎస్బీఐ నుంచి రూ.70 వేల కోట్ల పెద్ద మొత్తాల్లో చేసిన డిపాజిట్లు తరలిపోయాయి. దీంతో ఎస్‌బీఐ సైతం మార్కెట్‌కు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచక తప్పలేదు. దీని ప్రకారం స్వల్ప కాలిక డిపాజిట్లు(46-179 రోజులు) ఇకపై 4.85% వడ్డీని, ఏడాది నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లు 5.25% వడ్డీ రేట్లు అమలవుతాయి. ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉపయోగపడే యాప్‌లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెప్టెంబరులో ముగిసిన త్రైమాసికానికి ఏడాది కాలంలో డిపాజిట్ల వృద్ది 10.2% మేర ఉంది. దాదాపు డిపాజిట్ల సంఖ్య రూ.26,23,180 కోట్లకు చేరింది. అదే సమయంలో టర్మ్ డిపాజిట్లలో వృద్ది మందకొడిగా ఉంటూ కేవలం 3% వృద్దితో రూ.13,92,980 కోట్లుగా ఉంది. ఈ డిపాజిట్ల మొత్తంలో భారతీయ మహిళా బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు(ఏప్రిల్ వరకూ) సైతం ఉన్నాయి.


Click it and Unblock the Notifications