వివిధ అవసరాలకు రకరకాల యాప్‌లు ఉండటంతో వినియోగదారులు తికమకపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎస్‌బీఐకి సంబంధించిన వివిధ యాప్‌లను, వాటి ఉద్దేశాలను స్పష్టంగా చూద్దాం.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ అనేది మీకు తెలిసిన విషయమే. వినియోగదారులకు చేరువయ్యేందుకు ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు సరికొత్త యాప్‌లను ప్రవేశపెడుతూ వస్తోంది.
వివిధ అవసరాలకు రకరకాల యాప్‌లు ఉండటంతో వినియోగదారులు తికమకపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎస్‌బీఐకి సంబంధించిన వివిధ యాప్‌లను, వాటి ఉద్దేశాలను స్పష్టంగా చూద్దాం.

స్టేట్‌బ్యాంక్ బడ్డీ:
స్టేట్‌బ్యాంక్ బడ్డీ 13 భాషల్లో ఉంది. ఇందులో నగదు బదిలీతో పాటు, వేరేవారిని నగదు అడిగే సదుపాయం, మనం చేయాల్సిన చెల్లింపులకు సంబంధించిన రిమైండర్లు, ఖాతాకు అదనపు నగదు బదిలీ, రీఛార్జీ, బిల్లు చెల్లింపు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

స్టేట్‌బ్యాంక్ ఫ్రీడమ్ యాప్:
స్వంత ఊర్లో కాకుండా ఎక్కడో నివాసం ఉండేవారికి అనుకూలమైన యాప్ ఇది. దీని సాయంతో ఖాతాలో ఉన్న నగదును తెలుసుకోవడంతో పాటు, అవసరాన్ని బట్టి ఇతరులకు నగదును ఆన్‌లైన్‌లోనే బదిలీ చేయవచ్చు.

ఎస్‌బీఐ క్విక్:
ఎస్‌బీఐ క్విక్ అనేది మిస్‌డ్‌కాల్ ద్వారా అందించే సేవ. ఇందుకోసం మొదటిసారి బ్యాంకు వద్ద మిస్‌డ్‌కాల్ బ్యాంకింగ్ కోసం నమోదు చేసుకోవాలి. తర్వాత బ్యాంకు సూచించిన నంబరుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వడం ద్వారా లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మొబైల్‌లోనే కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.ఉదా: నగదు విచారణ, మినీ స్టేట్‌మెంట్

స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్:
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. బిల్లు చెల్లింపులు, ఫండ్ ట్రాన్స్‌ఫర్(నగదు బదిలీ), రీఛార్జీ వంటివి ఇందులో చేయవచ్చు. ఎంపాస్‌బుక్‌ను ఆన్‌లైన్లో పొందవచ్చు.

ఎస్‌బీఐ ఎమ్‌వీసా:
షాపింగ్ చేసినప్పుడు అక్కడ దుకాణదారుడికి చెల్లింపులు చేయాలంటే ఈ యాప్ ఉపయోగపడుతుంది. స్టాటిక్ లేదా డైనమిక్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా దీన్ని పూర్తిచేయవచ్చు.

ఎస్‌బీఐ నోక్యూ:
బ్యాంకులో వెళ్లి వరుసలో నిలబడి విసుగుచెందే వారికి సమాధానంగా ఎస్‌బీఐ నోక్యూ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ బ్యాంకు అందించే కొన్ని సేవలకు ఈ-టోకన్ అందించడమే దీని ఉద్దేశం. దీని ద్వారా బ్యాంకు శాఖలో అడుగుపెట్టిన తర్వాత ఈ-టోకన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వరుసలో నిలుచునే అవసరం ఉండకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఎమ్‌క్యాష్:
ఆన్‌లైన్ఎస్‌బీఐ లేదా స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ ద్వారా ఎవరైనా ఎస్‌బీఐ వినియోగదారులకు పంపిన డబ్బును పొందేందుకు ఉద్దేశించిన సులభతర విధానమే స్టేట్‌బ్యాంక్ ఎమ్‌క్యాష్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకుండానే ఎస్‌బీఐ వినియోగదారులు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. లబ్దిదారు మొబైల్ నంబరు లేదా ఈ-మెయిల్‌కు డబ్బును నేరుగా బదిలీ చేయవచ్చు.

స్టేట్‌బ్యాంక్ సమాధాన్:
స్టేట్‌బ్యాంక్ వినియోగదారులైనా కాకపోయినా కొన్ని స్టేట్ బ్యాంక్ శాఖలకు లేదా కంట్రోలర్లకు ఏదైనా విషయం(ప్రశ్న) గురించి కాల్‌చేసి సమాచారాన్ని పొందేందుకు స్టేట్‌బ్యాంక్ సమాధాన్ ఉపయోగపడుతుంది. బ్యాంకు వద్ద నమోదైన ఈ-మెయిల్ ఐడీకి గృహ రుణం, విద్యా రుణానికి సంబంధించిన సర్టిఫికెట్లను పొందవచ్చు.

ఎస్‌బీఐ కార్డ్:
ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇప్పుడు నేరుగా ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఖాతా వివరాలను పొందవచ్చు. ఇందుకోసం మొదట ఎస్‌బీఐ కార్డ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్ ఆన్‌లైన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఇది సురక్షితమైనది, అనుకూలమైనది.

స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ కార్పొరేట్:
ఎస్‌బీఐ కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యాప్. సాఫ్ట్‌వేర్ స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ కార్పొరేట్. ఖాతా ప్లస్, వ్యాపార్, విస్తార్ విభాగాల వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ సరళ్:
ఇది వ్యాపార వర్గాల వారు ఆండ్రాయిడ్ స్మార్టఫోన్లో ఉపయోగించడానికి వీలుగా రూపొందించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆధారిత అప్లికేషన్.
తెలుగు.గుడ్‌రిటర్న్స్.ఇన్

ఆధార్ అనుసంధానానికి సంబంధించి నాలుగు ముఖ్య డెడ్ లైన్లు

పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఏటీఎం కార్డు,ఆధార్ కార్డు లాంటివి పోతే వాటిని తిరిగి ఎలా తెచ్చుకోవాలి?

మీ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఉపయోగాలు

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవడం ఎలా?
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications