For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్నాల‌జీ కార‌ణంగా ఎస్బీఐ లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తారా?

2018 ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌క్కువ ఉద్యోగుల‌తోనే ఎస్బీఐ నెట్టుకువ‌స్తుంద‌నే అర్థంతో ఆయన మాట్లాడారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించే యోచ‌న‌లో బ్యాంకు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధి

|

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఛైర్మ‌న్ ర‌జ‌నీష్ కుమార్ మాట‌ల‌ను బ‌ట్టి ఎస్‌బీఐ ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గిస్తుంద‌నే ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి. 2018 ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌క్కువ ఉద్యోగుల‌తోనే ఎస్బీఐ నెట్టుకువ‌స్తుంద‌నే అర్థంతో ఆయన మాట్లాడారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించే యోచ‌న‌లో బ్యాంకు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని ప‌రిణామాలు మీ కోసం...

1. స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,78,000

1. స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,78,000

2018 ఆర్థిక సంవ‌త్స‌రాన్ని త‌క్కువ మంది ఉద్యోగులు ఉండేట‌ట్లుగా ముగిస్తామ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ ర‌జ‌నీష్ కుమార్ గురువారం చెప్పారు. "ఎక్కువ మంది వినియోగ‌దారులు, వివిధ ర‌కాల క్లైంట్లు ఉన్న నేప‌థ్యంలో ఎక్కువ‌గా మానవ వ‌న‌రుల‌తో ప‌ని ఉంటుంది. న‌న్న‌డిగితే అంత మంది అవ‌స‌రం లేదంటాను, ప్ర‌స్తుతం 2,78,000 వేల మంది ప‌నిచేస్తున్నారు. ఇక‌పై అంత మందే ఉంటారు. ఏమో త‌క్కువ ఉండొచ్చు" అని కుమార్ అన్నారు.

2. సాంకేతిక‌త‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు రూ.4 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న ఎస్‌బీఐ

2. సాంకేతిక‌త‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు రూ.4 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న ఎస్‌బీఐ

డిజిట‌ల్ యుగంలో ఎక్కువ సాంకేతిక‌త‌ను వాడ‌టం ద్వారా ఖ‌ర్చు త‌గ్గించే చ‌ర్య‌లు వ‌స్తాయి. ఎస్బీఐ కేవ‌లం కొత్త టెక్నాల‌జీల కోస‌మే రూ.4 వేల కోట్లు ఖ‌ర్చుపెడుతోంది. ఇందులో ఏటీఎమ్‌లపై వెచ్చించే సొమ్ము లెక్క‌లోకి రాలేదు. అది కూడా క‌లుపుకుంటే మొత్తం ఖ‌ర్చు రూ.6000 కోట్ల‌కు పై మాటే అని కుమార్ చెప్పారు.

3. 8500 ఉద్యోగుల‌ను త‌గ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

3. 8500 ఉద్యోగుల‌ను త‌గ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

టెక్నాల‌జీ పెంచుతున్న కార‌ణంగా ఉద్యోగులను త‌గ్గిస్తున్న వాటిలో ఎస్బీఐ బ్యాంకే మొద‌టిది కాదు. సెప్టెంబ‌రు 2016 నుంచి సెప్టెంబ‌రు 2017 మ‌ధ్య హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగుల సంఖ్య‌ను 95,002 నుంచి 86,543 సంఖ్య‌ వ‌ర‌కూ త‌గ్గించింది. దాదాపు 8500 ఉద్యోగుల‌ను త‌గ్గించిన‌ట్ల‌యింది. హెచ్‌డీఎఫ్‌సీ డెప్యూటీ ఎండీ ప‌రేష్ సుక్తాంక‌ర్ చెప్పిన ప్ర‌కారం సెప్టెంబ‌రు 2016లో ఉద్యోగుల సంఖ్య బాగాఎక్కువ ఉంది. త‌ర్వాత త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య త‌గ్గుకుంటూ వ‌చ్చింది.ఆధార్ అనుసంధానికి సంబంధించి నాలుగు ముఖ్య డెడ్‌లైన్లు

4. జూన్‌తో పోలిస్తే పెరిగినా.. మొత్తం మీద త‌గ్గింది

4. జూన్‌తో పోలిస్తే పెరిగినా.. మొత్తం మీద త‌గ్గింది

2018 ఆర్ఘిక సంవ‌త్స‌రంలో జూన్ చివ‌రితో పోలిస్తే ప్రేవేటు రంగంలో రెండో పెద్ద బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ నందు ఉద్యోగుల సంఖ్య కాస్త పెరిగింద‌నే చెప్పాలి. జూన్ చివ‌రి నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య 83,750 మాత్ర‌మే. సెప్టెంబ‌రు 2017లో ఆ త్రైమాసికంలో 2500 మంది ఉద్యోగుల‌ను త‌మ విధుల నుంచి సాగ‌నంపిన‌ట్లు బ్యాంకు ప్ర‌క‌టించింది.

 నూత‌న దంప‌తుల‌కు 6 ఆర్థిక సూచ‌న‌లు నూత‌న దంప‌తుల‌కు 6 ఆర్థిక సూచ‌న‌లు

Read more about: sbi state bank of india
English summary

టెక్నాల‌జీ కార‌ణంగా ఎస్బీఐ లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తారా? | State Bank of India to cut staff chairman hints on that lines

“When you have such a vast and diverse client base as SBI, the need for human interface will always be there. But, if you ask me, it (employee count) was 278,000 at the beginning of this year, will it remain 278,000? It is unlikely,” sbi chaiman Rajnish Kumar said
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X