For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ మార‌క నిల్వ‌ల్లో త‌గ్గుద‌ల‌

న‌వంబర్ 3తో ముగిసిన వారానికి భార‌త‌దేశ విదేశీ మార‌క నిల్వ‌ల్లో త‌గ్గుద‌ల న‌మోదు అయింది. ఆర్‌బీఐ వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం 22.2 మిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గి 398.739 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి.

|

న‌వంబర్ 3తో ముగిసిన వారానికి భార‌త‌దేశ విదేశీ మార‌క నిల్వ‌ల్లో త‌గ్గుద‌ల న‌మోదు అయింది. ఆర్‌బీఐ వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం 22.2 మిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గి 398.739 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి. విదేశీ క‌రెన్సీ ఆస్తులు మాత్రం 547.80 మిలియ‌న్ డాల‌ర్ల పెరుగుద‌ల సభ‌వించింది. మొత్తం విదేశీ నిల్వ‌ల్లో సింహ భాగం ఉండే ఈ విదేశీ క‌రెన్సీ ఆస్తులు అంత‌కు ముందు అక్టోబ‌ర్ 26తో ముగిసిన వారానికి 374.320 బిలియ‌న్ డాల‌ర్ల వద్ద ఉన్నాయి. విదేశీ క‌రెన్సీ ఆస్తుల‌ను ఎక్కువ‌గా యూఎస్ డాల‌ర్లు, యూరోలు, పౌండ్ స్టెర్లింగ్‌, జ‌ప‌నీస్ యెన్ వంటి క‌రెన్సీల్లో దాస్తారు. ఆర్బీఐ ఎక్కువ‌గా వారం రోజుల్లో విదేశీ క‌రెన్సీలు కొనేందుకు మొగ్గుచూపినందు వ‌ల్లే విదేశీ క‌రెన్సీ ఆస్తుల్లో పెరుగుద‌ల క‌న‌బ‌డింది.

 విదేశీ మార‌క నిల్వ‌ల త‌గ్గుద‌ల

మ‌రో వైపు బంగారం నిల్వ‌లు మాత్రం 573.60 మిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గి 20.66 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ వ‌ద్ద ఉన్న క‌రెన్సీ డ్రాయింగ్ రైట్స్ 1.4 మిలియ‌న్ డాల‌ర్ల మేర పెరిగాయి. అంత‌కు ముందు వారం 1.49 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి.

Read more about: forex india
English summary

విదేశీ మార‌క నిల్వ‌ల్లో త‌గ్గుద‌ల‌ | Forex reserves drop by 22 million dollars as on November 3rd

India’s forex exchange reserves dropped by $22.2 million as on November 3 to $398.739 billion, data from the RBI shows.
Story first published: Saturday, November 11, 2017, 12:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X