భారతీయులందరికీ దేశీయ లావాదేవీలతో పాటు అంతర్జాతీయంగా చెల్లింపులు జరిపే అవకాశాన్ని ఇచ్చేందుకు పేపాల్ సన్నద్దమవుతోంది.
భారతీయులందరికీ దేశీయ లావాదేవీలతో పాటు అంతర్జాతీయంగా చెల్లింపులు జరిపే అవకాశాన్ని ఇచ్చేందుకు పేపాల్ సన్నద్దమవుతోంది. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ చెల్లింపులకు అందుబాటులో పేమెంట్ సంస్థ పే పాల్ ఇకపై భారతీయులు కూడా అంతర్జాతీయంగా కూడా చెల్లింపులు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ పరిణామానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుగు గుడ్‌రిటర్న్స్ పాఠకుల కోసం...

అమెరికాలో ఆదరణ ఉన్న పేపాల్, ఇప్పుడు భారత్‌లోకి
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారంగా ఉన్న ఆన్ లైన్ ద్వారా ఇకపై పే పాల్ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చని పేపాల్ హోల్డింగ్స్ ఒకప్రకటనలో తెలిపింది. తద్వారా స్థానిక , ప్రపంచ చెల్లింపులను ప్రాసెస్ చేయగలరని తెలిపింది.భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ సర్వీసులు అందించడం ద్వారా డిజిటల్ ఇండియాలో భాగస్వామ‍్యం కావడం గర్వంగా ఉందని పేపాల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ పాహుజా పేర్కొన్నారు.

21కోట్లకు పైగా కస్టమర్లు
నాస్‌డాక్ లిస్టెడ్ సంస్థ అయిన పేపాల్ 2016 సంవత్సరానికి 10.8 బిలియన్ డాలర్ల రెవెన్యూను కలిగి ఉంది. అదే సమయంలో ఈ సంస్థ లావాదేవీల పరిమాణం 354 బిలియన్ డాలర్ల మేర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పేపాల్ చెల్లింపుల వ్యవస్థలో ఇంతవరకూ దాదాపు 21.8కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

పేపాల్ గురించి
పేపాల్ అనేది ఈబే అనుబంధ సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ని సాన్ జోస్‌లో ఉంది. ఈ సంస్థ వ్యవస్థపాకులు కెన్ హోవరీ, మ్యాక్స్ లెవిచిన్, ఎలాన్ మస్క్, లుకె నొసెక్, పీటర్ థీల్. ఈ సంస్థకు సంబంధించి ప్రస్తుతం పాట్రిక్ డుపియస్ సీఎఫ్‌వోగా వ్యవహరిస్తున్నారు. డేవిడ్ మార్కస్ పేపాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థ వెబ్సైట్ పేపాల్.కామ్. ఈ సంస్థ అలెక్సా ర్యాంకింగ్ 2013లో 39 గా ఉంది. ప్రస్తుతం 2017 నవంబరులో యూఎస్లో ఈ సంస్థ అలెక్సా ర్యాంకింగ్ 30వద్ద ఉండగా, గ్లోబల్ ర్యాంక్ 68.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications