For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రుసుములు రద్దు;చెక్‌ బుక్‌ జారీ, లావాదేవీల చార్జీల పెంపు

డిజిట‌ల్ లావాదేవీల‌కు మ‌రింత ముంద‌డుగు ప‌డేలా హెచ్‌డీఎఫ్‌సీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆన్‌లైన్ మార్గంలో జరిపే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రుసుముల‌ను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది

|

డిజిట‌ల్ లావాదేవీల‌కు మ‌రింత ముంద‌డుగు ప‌డేలా హెచ్‌డీఎఫ్‌సీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆన్‌లైన్ మార్గంలో జరిపే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రుసుముల‌ను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాదు, చెక్‌ బుక్‌ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ఖాతాదారులు ఇక‌ నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌ల‌ను ఉచితంగా జ‌రుపుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల(న‌వంబ‌ర్) 1 నుంచి ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు పేర్కొంది. త‌మ బ్యాంకులో పొదుపు, వేత‌న (శాల‌రీ, సేవింగ్స్) ఖాతాల విష‌యంలో ఈ మార్పు వ‌ర్తిస్తుంద‌ని హెచ్డీఎఫ్‌సీ ప్ర‌క‌టించింది.

అలాగే, చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ స‌వ‌ర‌ణ‌ ఛార్జీలను వ‌చ్చేనెల 1 నుంచి అమలు చేస్తామని పేర్కొంది. దీంతో పొదుపు, వేత‌న ఖాతాలు కాకుండా మిగిలిన త‌ర‌హా ఖాతాల విష‌యంలో చెక్కు సంబంధిత రుసుములు మ‌రింత ప్రియం కానున్నాయి. గతంలో రూ.2 లక్షల లోపు ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలు జ‌రిపితే రూ.25 రుసుం వ‌సూలు చేసేది. ఇక 2 నుంచి 5 లక్షలపై రూ.50 విధించేది. అలాగే నెఫ్ట్‌ లావాదేవీలపై పది వేల లోపు అయితే రూ.2.50, లక్ష దాటిన‌ లావాదేవీలపై రూ. 5 నుంచి రూ.15 వ‌ర‌కు వ‌సూలు చేసేది.

న‌గ‌దు లావాదేవీల చార్జీల‌ను ర‌ద్దు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ

చెక్కు సంబంధిత చార్జీలు ఇలా...
ఇంత‌కుముందు హెచ్‌డీఎఫ్‌సీ ఏడాదికి రెండు చెక్కు పుస్త‌కాల‌ను ఉచితంగా ఇచ్చేది.
ఇక‌పై ఏడాదికి (25లీఫ్‌లు) ఒక చెక్కు పుస్తకాన్ని మాత్ర‌మే ఉచితంగా పొంద‌వ‌చ్చు.
చెక్కు బౌన్స్ సంబంధించి ఇక‌పై అప‌రాధ రుసుము రూ.500 గా మార్చారు, ఇంత‌కుముందు ఇది రూ.350.
ఒకే త్రైమాసికంలో రెండోసారి చెక్ బౌన్స్ అయితే రూ. 750 అప‌రాధ రుసుము.

Read more about: hdfc neft rtgs
English summary

నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రుసుములు రద్దు;చెక్‌ బుక్‌ జారీ, లావాదేవీల చార్జీల పెంపు | HDFC bank removed charges for NEFT and RTGS transactions

Private lender HDFC Bank has made online transactions through RTGS and NEFT free of cost from November 1, with an aim to promote a digital economy.
Story first published: Tuesday, November 7, 2017, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X