ఇన్ఫోసిస్ కొత్త సిఇఒ వేమూరి!
విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ బాస్ పదవి నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ సంస్థకు పూర్తిస్థాయి సీఈవో లేరు. ఇప్పుడు ఆ సంస్థ కొత్త సీఈవోగా ఆ సంస్థ మాజీ ఉద్యోగి అశోక్ వేమూరి నిమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నా
విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ బాస్ పదవి నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ సంస్థకు పూర్తిస్థాయి సీఈవో లేరు. ఇప్పుడు ఆ సంస్థ కొత్త సీఈవోగా ఆ సంస్థ మాజీ ఉద్యోగి అశోక్ వేమూరి నిమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త చైర్మన్ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ కమిటీ విశాల్ సిక్కా స్థానంలో మాజీ ఉద్యోగి అశోక్ వేమూరి అభ్యర్థిత్వం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమా చారం. వేమూరు గతంలో ఇన్ఫోసిస్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. సంస్థ పని విధానం గురించి కాస్త లోతైన అవగాహన ఉంది.అమెరికాలో ఇన్ఫోసిస్ కార్యకాలా పాలకు అధినేతగా కూడా పని చేసిన అపార అనుభవం వేమూరి సొంతం. ఈ నేపథ్యంలో సిఇఒ ఎంపిక కమిటీ వేమూరి పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది.

అశోక్ వేమూరి గతంలో ఐగేట్ కార్పొరేషన్ అధినేతగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన జిరాక్స్ బిజినెస్ సర్వీసెస్ సీఈవోగా పని చేస్తున్నారు. వేమూరితో చర్చలు తొలి దశలో ఉన్నట్టుగా సంస్థ వర్గాలు చెబుతున్నాయి. సీఈవోగా నిమించే విషయమై ఇన్ఫోసిస్ వర్గాలు ఇప్పటికే వేమూరిని సంప్రదించినట్టు.. ఈ వ్యవహారంతో దగ్గరగా సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ఈ ప్రతిపాదన విషయమై వేమూరి తన స్పందనను వెల్లడించాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐగేట్ సంస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సంస్థ పగ్గాలను చేపట్టి మేటిగా తీర్చిదిద్దిన ఘనత వేమూరి సొంతం. దీనికి తోడు ఇన్ఫోసిస్ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా కార్యాలయాల్లో పని చేసి కొత్త వ్యూహాలతో ఆర్డర్లను సాధించడంలో వేమూరి సిద్ధహస్తులు అని చాలా మంది అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications