For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ నంబ‌రు, ఆధార్ లింకింగ్ చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 6,2018

ఆధార్ నంబ‌రుతో మొబైల్ నంబ‌రు అనుసంధానం చేయ‌డానికి ఉన్న గ‌డువును ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి 6,2018 నాటి వ‌ర‌కూ పెంచింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కార‌ణంగా చూపింది. సుప్రీంకోర్టు ఇది

|

ఆధార్ నంబ‌రుతో మొబైల్ నంబ‌రు అనుసంధానం చేయ‌డానికి ఉన్న గ‌డువును ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి 6,2018 నాటి వ‌ర‌కూ పెంచింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కార‌ణంగా చూపింది. సుప్రీంకోర్టు ఇదివ‌ర‌కే ఆధార్ సంఖ్య‌ను ఫోన్ నంబ‌రుతో అనుసంధానం చేయాల్సిందిగా ఇచ్చిన తీర్పును క‌చ్చితంగా అంద‌రూ పాటించాల్సిందేన‌ని కేంద్రం ఉద్దేశంగా ఉంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ పాఠ‌కుల‌ కోసం...

కేంద్ర ప్ర‌భుత్వం, యూఐడీఏఐ

కేంద్ర ప్ర‌భుత్వం, యూఐడీఏఐ

అదే విధంగా బ్యాంకు ఖాతాల‌ను సైతం యూఐడీఏఐ(ఆధార్‌)తో అనుసంధానం చేసే విష‌యాన్ని సైతం కేంద్ర ప్ర‌భుత్వం ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మార్కెట్లో ప్ర‌చారం ఉన్న విధంగా మొబైల్ నంబ‌ర్ల‌తో ఆధార్ అనుసంధానం చేసేట‌ప్పుడు వేలిముద్ర ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని యూఐడీఏఐ స్ప‌ష్టం చేసింది. డిసెంబ‌రు 1 నుంచి ఉన్న ఇంటి ద‌గ్గ‌ర నుంచే ఓటీపీ అవ‌స‌రం లేకుండా మొబైల్ నంబ‌రును ఆధార్ అనుసంధానం చేసే వీలుంటుంద‌ని ఆధార్ నియంత్ర‌ణ‌, ప్రాధికార సంస్థ వెల్ల‌డించింది.

సందేశాల‌ను పంపుతున్న మొబైల్ కంపెనీలు

సందేశాల‌ను పంపుతున్న మొబైల్ కంపెనీలు

కేంద్రం చెప్పిన విధంగా ఒక నిర్ణీత గడువులోగా మొబైల్ నంబ‌రును, ఆధార్‌ను అనుసంధానం చేయ‌క‌పోతే మీ సిమ్ కార్డు ఇన్‌వాలిడ్ అవుతుంద‌ని మొబైల్ కంపెనీలు వినియోగ‌దారుల‌కు సంక్షిప్త సందేశాల‌ను పంపుతున్న సంగ‌తి విదిత‌మే.

ఆధార్ లింక్ పై కేంద్రానికే సానుకూలం

ఆధార్ లింక్ పై కేంద్రానికే సానుకూలం

మొబైల్ సంఖ్య‌, బ్యాంకు ఖాతాల‌కు ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిసరి చేస్తూ కొన్ని నెల‌ల క్రిత‌మే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల విష‌యంలో మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు.

సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు తీర్పు

లోక్‌నీతి ఫౌండేష‌న్ కేసులో భౄగంగా 2017 ఫిబ్ర‌వ‌రి 6న నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్(కేవైసీ) నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మొబైల్ నంబ‌రుకు ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును కేంద్రానికి అనుకూలంగా వెలువరించింది. దీని కోసం ఏడాది స‌మ‌యాన్ని ప్ర‌జ‌లంద‌రికీ ఇచ్చే విధంగా కేంద్రానికి సూచించింది.

Read more about: mobile aadhar uidai
English summary

మొబైల్ నంబ‌రు, ఆధార్ లింకింగ్ చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 6,2018 | On aadhar mobile link supreme does not agreed to give stay on centre order

mobile aadhar linking is mandatory as ordered by centre
Story first published: Friday, November 3, 2017, 18:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X