ఈ 6 ఐటీ కంపెనీలు ఐటీ ఉద్యోగులను భారీగా తీసేశాయ్
వ్యవస్థీకృత రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించేదిగా పేరుగాంచిన ఈ రంగం ఉద్యోగాల కల్పనలో మాత్రం ఆందోళనకర పరిస్థితిని తలపిస్తోంది. ఈ పరిణామానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో గత ఆరు నెలల్లో దాదాపు 4వేలకు పైగా ఉద్యోగాలు మాయమయ్యాయి. టీసీఎస్, హెసీఎల్ టెక్నాలజీ కాకుండా దాదాపుగా చాలా పెద్ద ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించివేశాయి. వ్యవస్థీకృత రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించేదిగా పేరుగాంచిన ఈ రంగం ఉద్యోగాల కల్పనలో మాత్రం ఆందోళనకర పరిస్థితిని తలపిస్తోంది. ఈ పరిణామానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నియామకాల్లో నెమ్మదితనం
ఫలితాల్లోనూ ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తుంటాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీలు వెల్లడించిన గణాంకాల ఆధారంగా చాలా కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తున్నది. 156 బిలియన్ డాలర్ల ఇండియన్ ఐటీ పరిశ్రమ 2008లో మాంద్యానికి గురైనా తర్వాత కోలుకుంది. ఇప్పుడు పరిస్థితి మాత్రం కొత్త ప్రాజెక్టులు తగినంత లేక, నియామకాల్లో చెప్పుకోదగ్గ పరిస్థితి లేని నెలకొంది.

ఒక్క కాగ్నిజెంట్లోనే
కాగ్నిజెంట్ విషయంలో పరిస్థితి ఎక్కువ దారుణంగా ఉంది. దాదాపు 5000 మంది ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తున్నది. టీసీఎస్ విషయంలో సైతం ఉద్యోగుల సంఖ్య తగ్గనప్పటికీ అంత సానుకూలంగా లేదు. గతేడాది మొదటి ఆరు నెలల్లో ఉన్న నూతన నియామకాల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తీసుకున్న కొత్త ఉద్యోగుల సంఖ్య తక్కువే.

తగ్గిన ఉద్యోగులు
ఆరు నెలల కాలంలో ఆరు కంపెనీల్లో మొత్తం తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య 4157 వద్ద ఉంది. అదే క్రితం ఏడాది ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నికర నియామకాల సంఖ్య మాత్రం 60 వేలుగా ఉంది. అంటే ఎక్కడో పరిస్థితిలో తేడా వచ్చినట్లు కనిపిస్తోంది.

నాస్కామ్ అలా చెప్పింది కానీ...
ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద ఎక్కువ ఉద్యోగాలు కొత్తగా కల్పించబడతాయని కొన్నాళ్ల క్రితం నాస్కామ్ భరోసా ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ కంపెనీల సంఘం అంచనా ప్రకారం దాదాపు 1.3-1.5 లక్షలు కొత్తగా వస్తాయని అంచనా వేశారు. అది స్థూల నియామకాల సంఖ్య అన్నట్లుగా ఉంటోంది. ఐటీ రంగంలో నుంచి స్వచ్చందంగా తప్పుకున్న లేదా కంపెనీలు తొలగించిన ఉద్యోగులను తీసివేయంగా ఐటీ రంగంలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగితేనే పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

ఆటోమేషన్ కారణమా!
''కంపెనీలు డిజిటలైజేషన్, ఆటోమేషన్ బాట పట్టడం సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లను అందిస్తోంది. చాలా కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యలో నికర తగ్గుదల ఉండటమే కాకుండా ఉద్యోగుల నూతన నియమాకాల్లో సైతం ప్రతికూల పరిస్థితి ఉంది.'' అని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టామ్ ర్యూనర్ చెప్పారు.

టీసీఎస్ మాత్రమే టాప్3లో బెటర్
ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిన విధంగా ఉంది. టాప్3 దేశీయ ఐటీ కంపెనీల్లో టీసీఎస్ మాత్రమే ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లుగా కనబడలేదు.


Click it and Unblock the Notifications