కంపెనీ నికర లాభంలో వృద్ది, బీఎఫ్ఎస్ఐ రంగంలో లోటుపాట్లు
కాగ్నిజెంట్ గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం 444 మిలియన్ డాలర్ల కంటే ఇది 11% ఎక్కువ. ఇంకా కంపెనీ ఆదాయాలు చూస్తే 9.1% వృద్దితో 3.77 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
కాగ్నిజెంట్ త్రైమాసిక ఫలితాలు ఐటీ రంగంలో ఉన్న ఆందోళనకర పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. కంపెనీ రెవెన్యూ అంచనాలను ఏడాదికి 9.5 నుంచి 10 శాతంగా ఉంచడమే ఇందుకు కారణం. బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్,ఇన్సూరెన్స్) కేటగిరీకి సంబంధించిన వృద్ది కంపెనీ సగటు వృద్ది రేటు(9.1%) కంటే తక్కువగా ఉంది. అయితే ఓవరాల్‌గా కంపెనీ రెవెన్యూ, నికర లాభాల పరిస్థితి చెప్పుకోదగ్గ విధంగానే ఉందని తెలుస్తోంది.

ప్రస్తుత ఏడాది మూడో త్రైమాసికంలో సెప్టెంబరుతో ముగిసిన 3 నెలల కాలంలో నికర లాభం 495 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం 444 మిలియన్ డాలర్ల కంటే ఇది 11% ఎక్కువ. ఇంకా కంపెనీ ఆదాయాలు చూస్తే 9.1% వృద్దితో 3.77 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలు
భారత్‌లో ఐటీ ఉద్యోగుల పరంగా మూడో అతిపెద్ద కంపెనీగా కాగ్నిజెంట్ ఉంది. ఈ ఏడాది అంతకుముందు త్రైమసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,56,800గా ఉండగా సెప్టెంబరు త్రైమాసికానికి స్వల్పంగా తగ్గి 2,56,100గా ఉంది. దేశంలో ఇదివరకే ఫలితాలను వెల్లడించిన ఐటీ దిగ్గజ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్; ఇన్ఫోసిస్, విప్రో వంటి వాటి కంటే నికర లాభాల్లోనూ, రెవెన్యూ విషయంలో సెప్టెంబరు మాసంలో సీటీఎస్ పరిస్థితి ఉండటం ఒక విధంగా సంతోషించాల్సిన విషయం.


Click it and Unblock the Notifications