జీఎస్టీఆర్-2 రిటర్నుల ఆఖరు తేదీ అక్టోబర్ 31 కాదు
జీఎస్‌టీఆర్-2 దాఖలుకు గతంలో అక్టోబర్ 31వ తేదీగా నిర్ణయించిన గడువును నవంబర్ 30వ తేదీ వరకు, జీఎస్‌టీఆర్-3 దాఖలుకు నవంబర్ 11వ తేదీగా నిర్ణయించిన గడువును డిసెంబర్ 11వ తేదీకి పొడిగిస్తున్నామని కేంద్ర ప్రభు
జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. జూలై నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-2 దాఖలుకు గతంలో అక్టోబర్ 31వ తేదీగా నిర్ణయించిన గడువును నవంబర్ 30వ తేదీ వరకు, జీఎస్‌టీఆర్-3 దాఖలుకు నవంబర్ 11వ తేదీగా నిర్ణయించిన గడువును డిసెంబర్ 11వ తేదీకి పొడిగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎస్‌టీఆర్-2 లేదా కొనుగోళ్ల రిటర్న్‌లు జీఎస్‌టీఆర్-1తోనూ,జీఎస్‌టీఆర్-3 రిటర్న్‌లు జీఎస్‌టీఆర్-2 రిటర్న్‌లతోనూ సరిపోలాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. జూలై నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-1 దాఖలుకు గడువుగా నిర్ణయించిన అక్టోబర్ 1వ తేదీ నాటికి 46.54 లక్షల మందికి పైగా వ్యాపారులు తమ రిటర్న్‌లను దాఖలు చేశారని, ఇప్పుడు జీఎస్‌టీఆర్-2 దాఖలు గడువును పొడిగించడంతో 30.81 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు లభిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది.

జీఎస్టీఆర్2 దాఖలు చేసేటప్పుడు ఎదురవుతున్న పలు సవాళ్ల కారణంగా వివిధ వ్యాపార వర్గాలు ఎదురు చూస్తున్న క్రమంలో ఈ గడువు పెంచడం ఆందోళనను తగ్గిస్తుందని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ అభిషేక్ జైన్ వెల్లడించారు. మరో అగ్రశ్రేణి ఆడిట్ సంస్థ డెలాయిట్ ఇండియా ప్రతినిధి ఎం.ఎస్.మణి మాట్లాడుతూ జీఎస్టీ దాఖలు గడువు సమయం పెంచడం జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు దోహదం చేస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications