మొబైల్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం సులభతరం చేస్తూ కేంద్రం ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. కేవలం స్టోర్లకు వెళ్లే కాకుండా ఇంట్లో కూర్చొనే మొబైల్ అనుసంధానం పూర్తయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తోంద
దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ కస్టమర్లు ఉన్నారు. వీరంతా తమ మొబైల్ నంబరును ఆధార్ సంఖ్యతో అనుసంధానించడం అంత సులువుగా అయ్యే పనికాదు. దీంతో దీన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎస్సెమ్మెస్, ఐవీఆర్‌ఎస్, మొబైల్ యాప్స్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. కేంద్ర టెలికాం శాఖా మంత్రి మనోజ్ సిన్హా ఈ మేరకు వివరాలను సరళమైన విధానాలను వెల్లడించారు. అవి మీ కోసం...

వారి కోసం ఇళ్లకే వచ్చి...
సర్వీస్ సెంటర్లకు వచ్చి రీ-వెరిఫికేషన్ చేయించుకోలేని వాళ్ల కోసం ఇంటి దగ్గరికే వెళ్లి ఆ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందు కోసం వినియోగదారుల ఇంటి వద్దకే టెలికాం సంస్థలు తమ ప్రతినిధులను పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధపడుతున్న వారి కోసం ఈ విధానం తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. ఇలాంటి సేవలు కోరుకునే వారు ఆన్‌లైన్‌లోనే అభ్యర్థన చేసుకునేలా.. చర్యలు తీసుకోవాలని టెలికాం సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.

2. ఓటీపీ ద్వారా
ఆధార్ ఓటీపీ ద్వారా కూడా రీ-వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించడం మరో మార్గం. ఎస్సెమ్మెస్, ఐవీఆర్‌ఎస్, మొబైల్ యాప్స్ ద్వారా వంటి ప్రక్రియలను ఇందుకు ఉపయోగించుకోవచ్చని టెల్కోలను కేంద్రం కోరింది. ఆధార్ డేటాబేస్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపించడం ద్వారా.. ఆ నంబర్ రీవెరిఫికేషన్‌తోపాటు అదే సబ్‌స్క్రయిబర్‌కు సంబంధించిన ఇతర మొబైల్ నంబర్స్‌ను కూడా రీవెరిఫై చేయవచ్చు. ఆధార్ డేటాబేస్‌లో ఇప్పటికే 50 కోట్ల మొబైల్ నంబర్లు ఉన్నాయి. వీరందరికీ వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా రీ వెరిఫికేషన్ పూర్తి చేయడం సులభతరం.

3. ఏజెంట్ సాయంతో
ఏజెంట్ సాయంతో సిమ్ రీవెరిఫికేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కస్టమర్లకు సంబంధించిన ఇ-కేవైసీ వివరాలను పూర్తిగా ఏజెంట్‌కు చూపించకుండా జాగ్రత్త పడాలని, వాళ్ల డివైస్‌లలోనూ ఈ వివరాలు లేకుండా చూడాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో.. ఇ-కేవైసీ వివరాలు టెలికాం సంస్థ ఏజెంట్‌కు పూర్తిగా తెలిసేలా ఉన్నాయి.

4. స్టోర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు...
మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోండంటూ టెలికాం ఆపరేటర్ల నుంచి పదేపదే ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు వస్తుండటంతో ఇప్పటికే కస్టమర్లు ఆయా స్టోర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలు కాస్త ఊరటనిచ్చే అవకాశముంది. మరోవైపు ఆధార్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం గడువును 2018 మార్చికి పొడగించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications