For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార‌త్‌లో వ‌చ్చే 10 ఏళ్లు ఏటా 10% వృద్ది: మోర్గాన్ స్టాన్లీ

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వ‌చ్చే 10 ఏళ్లు ఏటా 10% వృద్దితో కొన‌సాగుతుంద‌ని ఆ సంస్థ త‌యారుచేసిన నివేదిక పేర్కొంది.

|

ఒక నిఫ్టీ రికార్డు స్థాయి గ‌రిష్టాల వ‌ద్ద కొన‌సాగుతున్న నేప‌థ్యంలో భార‌తీయులు సంతోషించే విష‌యాన్ని మోర్గాన్ స్టాన్లీ వెల్ల‌డించింది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వ‌చ్చే 10 ఏళ్లు ఏటా 10% వృద్దితో కొన‌సాగుతుంద‌ని ఆ సంస్థ త‌యారుచేసిన నివేదిక పేర్కొంది. ఇదంతా దేశంలో ఉన్న జ‌నాభా, సంస్క‌ర‌ణ‌లు, ప్ర‌పంచీక‌ర‌ణ వ‌ల్ల జ‌రుగుతుంద‌ని చెప్పింది. మోర్గాన్ స్టాన్లీ ప్ర‌కారం వ‌చ్చే ద‌శాబ్ద కాలం పాటు 10 వార్షిక వృద్ది సాధ్య‌మ‌వుతుంది.
న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సాధ్యం చేసే దిశ‌గా ప్ర‌భుత్వం తీసుకున్న చర్య‌లు, అంతే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి కొన‌సాగుతున్న పాత ప‌న్ను వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న వంటివి వృద్దిని వేగంగా ప‌ట్టాలెక్కించేందుకు దోహ‌ద‌పడ్డాయి. ఇవి రెండూ వ‌చ్చే ప‌దేళ్లు భార‌త్‌ను వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల స‌ర‌స‌న నిల‌బెట్టుట‌కు దోహ‌దం చేస్తాయ‌ని నివేదిక అభిప్రాయ‌ప‌డింది.

 భార‌త వృద్దిపై ఆశాభావం

ఇప్ప‌టికే వృద్ది ఒక విధ‌మైన సానుకూల దిశ‌లో కొన‌సాగుతోంద‌ని, డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ మూలంగా వార్షిక వృద్ది 10%(డాల‌ర్ విలువ‌ల్లో) వ‌చ్చే ప‌దేళ్ల పాటు న‌మోద‌య్యేందుకు ఇది దారిచూపుతుంద‌ని మోర్గాన్ స్టాన్లీ ఆసియా విభాగాధిప‌తి అనిల్ అగ‌ర్వాల్ విశ్లేషించారు. ఈ నెల‌లోనే ఇంత‌కుముందు రిధ‌మ్ దేశాయ్ చెప్పిన‌ట్లు డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ జీడీపీ వృద్దిని 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర పెంచుతుంది, దీంతో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్త 2026-27 నాటికి 6 ట్రిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల స్థాయికి చేరుకుంటుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక ప్ర‌కారం డిజిట‌ల్ లావాదేవీల‌ను ఇప్పుడున్న స్థాయి నుంచి వ‌చ్చే ఏడాది కాలంలో ఆరు రెట్లు చేయాల‌ని యోచిస్తున్నారు.

Read more about: india gdp growth
English summary

భార‌త్‌లో వ‌చ్చే 10 ఏళ్లు ఏటా 10% వృద్ది: మోర్గాన్ స్టాన్లీ | Morgan stanley estimated Indian growth rate 10percent per annum for next 10 years

Amid the euphoria of Nifty touching record highs and the ongoing festive season; Morgan Stanley’s report says that India’s economy will grow by more than 10% annually in the coming decade, buoyed by demographics, reforms and globalization
Story first published: Monday, October 16, 2017, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X