టెలికాంలో అతిపెద్ద విలీనానికి ఐడియా సెల్యూలార్ వాటాదార్ల ఆమోదం
వొడాఫోన్-ఐడియా విలీనం ద్వారా దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థ ఆవిర్భవించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశీయ టెలికామ్ పరిశ్రమ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ విలీన ప్రతిపాదనకు ఐడియా సెల్యులార
వొడాఫోన్-ఐడియా విలీనం ద్వారా దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థ ఆవిర్భవించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశీయ టెలికామ్ పరిశ్రమ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ విలీన ప్రతిపాదనకు ఐడియా సెల్యులార్ వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ నెల 12వ తేదీన జరిగిన సమావేశంలో 99 శాతం మందికి పైగా వాటాదారులు ఈ విలీనానికి ఆమోదం తెలిపారని ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్ సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలియజేసింది. ఈ విలీనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు ఇటీవల ఎన్‌సిఎల్‌టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించాయి. దీంతో ఎన్‌సిఎల్‌టి ఆదేశాల మేరకు ఐడియా సెల్యులార్ సంస్థ గురువారం తమ వాటాదారుల సమావేశాన్ని నిర్వహించి ఈ విలీన ప్రతిపాదనకు ఆమోదాన్ని పొందింది.

ఇక ఈ విలీనం కోసం వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థలు డిఓటి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్) నుంచి తుది అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశీయ టెలికామ్ మార్కెట్‌లో దాదాపు 35 శాతం వాటాను కలిగివున్న ఈ రెండు సంస్థలు తమ వ్యాపారాలను విలీనం చేసుకుని 2300 కోట్ల డాలర్ల విలువైన అతిపెద్ద సంస్థను సృష్టించాలని ఈ ఏడాది ఆరంభంలో అంగీకారానికి వచ్చిన విషయం విదితమే. ప్రపంచంలోని అతిపెద్ద టెలికామ్ మార్కెట్లలో రెండవదిగా ఉన్న భారత్‌లో ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వొడాఫోన్ ద్వితీయ స్థానంలోనూ, ఐడియా సెల్యులార్ తృతీయ స్థానంలోనూ ఉన్నాయి.


Click it and Unblock the Notifications