ఎక్స్‌పెరిస్ ఐటి - మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ఎక్స్‌పెరిస్ ఐటీ ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి మధ్యలో కూడా ఐటీ నియామకాలు తగ్గిపోనున్న
* భారీ అవకాశాలు దక్షిణ భారతదేశంలోనే...
దేశీయ ఐటీ ఉద్యోగులకు గుది బండ లాంట వార్త. వచ్చే ఆరు నెలలు కూడా ఐటీ ప్రొఫిషనల్స్‌కు ఉద్యోగవకాశాలు తగ్గిపోనున్నాయని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాలకు భారీ మొత్తంలో ఆటంకం కలుగనున్నట్టు తెలిపాయి. ఎక్స్‌పెరిస్ ఐటి - మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ఎక్స్‌పెరిస్ ఐటీ ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి మధ్యలో కూడా ఐటీ నియామకాలు తగ్గిపోనున్నాయని తెలిసింది. సర్వే వెల్లడించిన మరిన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం...

1. జూనియర్, మిడిల్ స్థాయిలోనే నియామకాలు..
ఐటీ రంగంలో జూనియర్, మిడిల్ స్థాయిల్లోనే ఎక్కువగా నియామకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ స్థాయి ఉద్యోగాలపై ఎక్కువగా వేటు పడే అవకాశముంది. ఐటీ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన కంపెనీల్లో సైతం లేఆఫ్‌లు రాబోయే 6-12 నెలల్లో పెరగనున్నాయి. స్టార్టప్ కంపెనీలనుంచి ఎక్కువ నియామకాలు జరిగే అవకాశముంది.

2. దక్షిణాదిలోనే భారీ అవకాశాలు..
దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఐటీ సంస్థలు నెలకొన్నాయి. దీంతో సహజంగానే ఇక్కడే నియామకాలు ఎక్కువగా ఉన్నట్టు సర్వే తెలిపింది. దేశం మొత్తం మీద దక్షిణ భారతదేశంలోనే 20% ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని దీని తరువాత పశ్చిమ భారతం, ఉత్తర భారతం ఉన్నాయని నివేదిక వెల్లడించింది. తూర్పు ప్రాంతంలో మాత్రం ఐటీ ఉద్యోగ లభ్యత అతి తక్కువగా రెండు శాతంలోపు ఉండటం గమనార్హం. డాలరుతో రూపాయి మారకపు విలువ

3. ఎక్కువ అవకాశాలు కొత్తగా ప్రవేశించే వారికే
ఈ రంగంలో కొత్తవారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడే డిగ్రీ పూర్తిచేసినవారితో పాటు 5 సంవత్సరాల మధ్యలో ఉద్యోగ అనుభవం ఉన్న వారిని ఎక్కువగా నియమించుకునేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తరువాత మిడిల్ లెవల్‌లో ఉన్న వారికి అవకాశాలు ఉన్నట్టు సర్వేలో కంపెనీలు పేర్కొన్నాయి.
సీనియర్ లెవల్ ఉద్యోగులను కొత్తగా నియమించేందుకు కొన్ని కంపెనీలు మాత్రమే ముందుకు రావడం విశేషం.

4. నైపుణ్యతకే పెద్దపీట
ఐటీ నియామకాల్లో నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ సర్వీసులతో పాటు నైపుణ్యం గలిగిన వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీని తరువాత బిగ్‌డేటా, ఎనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ ఉండగా తదుపరి స్థానాల్లో మెషిన్ లెర్నింగ్, మొబిలిటీ, గ్లోబల్ కంటెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. వీటితో పాటు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించేవారికి భారీ డిమాండ్ ఉందని తెలిసింది.

5. ఈ రంగంలో ఉన్నవారు ఇది చేయాల్సిందే...
ఇప్పటికే ఈ రంగంలో ఉన్న నిపుణులు తమ నైపుణ్యాలను మరింత పెంచుకోవాలని సర్వే సూచించింది. కొత్తగా ఉద్యోగాలలోకి వచ్చే వారు కూడా నైపుణ్యాలతో వస్తే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు తెలిపారు. ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా పనితీరును మార్చుకోవాలని అప్పుడే ఉద్యోగాలు నిలకడగా ఉంటాయని వారు వెల్లడించారు. ప్రపంచంలో డిజిటల్ శకంతో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా ఐటీ రంగంలో పనిచేసేవారు సిద్ధంకావాలని సర్వేలో ఐటీ రంగ నిపుణులు కోరారు. బెంగుళూరులో బంగారం ధరలు

గత రెండు త్రైమాసికాల్లో ఇలా...
అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది రాబోయే కాలంలో నియామకాలు తగ్గుతాయని అంచనా. దాదాపు కొత్త ఉద్యోగాల విషయంలో 15% పాయింట్ల తగ్గుదల నమోదైనట్లు సర్వే వెల్లడించింది. అదే ఏప్రిల్-సెప్టెంబరు మధ్య జరిగిన కొత్త నియామకాల్లో 58% సానుకూల నికర నియామకాలు నమోదయ్యాయి. మొత్తం మీద మిడిల్ లెవల్ ఉద్యోగులకు అందరి కంటే ఎక్కువగా 53% డిమాండ్ ఉందని తెలుస్తోంది.

ఐటీ రంగంలో ప్రస్తుత నియామకాలు
కష్టమైన, సరికొత్త ఐటీ నైపుణ్యాలు కలిగి ఉంటే వచ్చే కొద్ది నెలల్లో అటువంటి వారికి డిమాండ్ ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 20% మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికి జరుగుతున్న నియామకాల తీరు ఈ విధంగా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల ద్వారా తెలుస్తున్నది.
.నెట్(17%), శాప్(10%), బిగ్ డేటా(9%), ఒరాకిల్(2%), ఇతరాలు(20%)
ఇక్కడ ఇతర నైపుణ్యాలు అంటే ఉన్న టెక్నాలజీలోనే కొత్తవి నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను జోడించుకోవడం ఉద్యోగ అవకాశాలకు డోకా లేకుండా చేస్తుంది. భారతదేశంలో టాప్-10 రియల్ ఎస్టేట్ కంపెనీలు
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications