రెండో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా, టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని అధిగమించింది. అత్యధిక 4జీ అప్‌లోడ్ స్పీడులో సెప్టెంబర్ నెలలో మొదటి స్థానంలో ఐడియా సెల్యులార్ నిలిచింది.
రెండో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా, టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని అధిగమించింది. అత్యధిక 4జీ అప్‌లోడ్ స్పీడులో సెప్టెంబర్ నెలలో మొదటి స్థానంలో ఐడియా సెల్యులార్ నిలిచింది. టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ మై స్పీడు యాప్ డేటాలో ఈ విషయం వెల్లడైనట్లు ఐడియా టెలికాం వెల్లడించింది. సగటు 4జీ అప్‌లోడ్ స్పీడు సెప్టెంబర్‌లో ఐడియాది 6.307 ఎంబీపీఎస్ ఉందని ట్రాయ్ డేటా తెలిపింది. ఇదే నెలలో కంపెనీ సగటు డౌన్‌లోడ్ స్పీడు 8.74 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు పేర్కొంది. మైస్పీడు యాప్‌ను మరింత బలోపేతం చేయనున్నామని, తమ గణాంక పద్ధతిని మరింత పారదర్శకత చేస్తామని ట్రాయ్ చెప్పింది.

ట్రాయ్ సైటులో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 4జీ అప్‌లోడ్ స్పీడులో ఐడియా తర్వాత వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు నిలిచాయి. అయితే 4జీ డౌన్‌లోడ్ స్పీడులో మాత్రం జియో, వొడాఫోన్ తర్వాత ఐడియా మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను 2.60 లక్షల సైట్లకు విస్తరిస్తామని ఐడియా సెల్యులార్ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్ట్ దాకా 12 నెలల కాలంలో 50వేల బ్రాడ్‌బ్యాండు సైట్లను కంపెనీ ఏర్పాటుచేసింది. తద్వారా కంపెనీ 5888 పట్టణాలను, 1.05 లక్షల గ్రామాలను ఇంటర్నెట్ అనుసంధానం చేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications