ఐఐటీ ఢిల్లీ ప్రాంగణ నియామకాల్లో మొదటి రోజే శ్యామ్‌సంగ్, ఐబీఎమ్, విప్రో ఆయా విద్యార్థులకు రూ.20 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను
మన దేశంలో ఐఐటీ విద్యార్థుల నియమాకాల విషయంలో టెక్నాలజీ కంపెనీలకు పోటాపోటీ. వారిని నియమించుకోవడానికి 7 అంకెల వేతనాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడవు. ప్రస్తుత సంవత్సరం ఐఐటీ ఢిల్లీ ప్రాంగణ నియామకాల్లో మొదటి రోజే శ్యామ్‌సంగ్, ఐబీఎమ్, విప్రో ఆయా విద్యార్థులకు రూ.20 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

1. విద్యార్థుల నియామకాల కోసం రిజిస్ట్రేషన్
ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాలయాలైన ఐఐటీల్లో విద్యార్థులను తమ కంపెనీల్లో నియమించుకోవాలంటే ప్లేస్ మెంట్ సెల్ వద్ద ముందే నమోదు చేసుకోవాలి. అలా ఐఐటీ ఢిల్లీలో నియామకాల కోసం 40 సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. అక్కడ ప్రస్తుతం ప్రీ ప్లేస్‌మెంట్ సీజన్ మొదలయింది. ఐదు లేదా ఆరు కంపెనీలు విద్యార్థుల ఎంపికల కోసం ప్రీప్లేస్‌మెంట్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు చివరి ఏడాది విద్యార్థులు వెల్లడించారు.

2. డిసెంబరు 1 నుంచి మొదటి దశ నియామకాల ప్రక్రియ
ఐఐటీల్లో ప్రాంగణ నియామాకాల ప్రక్రియ చాలా పకడ్బందీగా జరుగుతుంది. అన్ని కంపెనీలు అక్కడ విద్యార్థులను నియమించుకునేందుకు సంస్థ ఒప్పుకోదు. ఒక కటాఫ్ ప్యాకేజీని నిర్ణయించి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసే సంస్థలను మాత్రమే క్యాంపస్‌లోకి అనుమతిస్తారు. ప్రస్తుతం తమ కరిక్యులమ్ వీటేల పరిశీలన జరుగుతోందని మెకానికల్ విద్యార్థి ఒకరు చెప్పారు.అయితే మొదటి దశ ప్లేస్మెంట్ ప్రక్రియ డిసెంబరు 1 నుంచి మొదలు అవుతుందని వెల్లడించారు.

3.ఐటీలో తగ్గిన నియామకాలు
ఒక పక్క ఐటీ రంగంలో చాలా మందిని తొలగించే ప్రక్రియ సాగుతుండటం, మరో పక్క ట్రంప్ మాత్రం అమెరికన్ టెక్నాలజీ కంపెనీలను స్థానికులను నియమించుకునేలా ఒత్తిడి తేవడం జరుగుతున్నప్పటికీ ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం దేశంలోనే ఉత్తమమైన ఉద్యోగార్థులుగా పేరుంది. తమ ప్లేస్‌మెంట్ అధికారి చెబుతున్న దాని ప్రకారం ఐటీ నియామకాలు తగ్గి, తయారీ రంగంలో పెరిగి ఉండొచ్చు. మరో ఏడాది ఇదే ధోరణి కొనసాగవచ్చని చివరి ఏడాది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఒకరు చెప్పారు. అయితే వేతనాల పరంగా చూస్తే రెండు మూడు కంపెనీలే ఎక్కువ వేతనం ఇచ్చేందుకు మొదటే మొగ్గుచూపుతున్నాయని ప్లేస్‌మెంట్ ప్రక్రియకు హాజరైన విద్యార్థుల సంభాషణను బట్టి తెలుస్తున్నది.

4. ప్రారంభంలో ఎక్కువగా ఈ కంపెనీల హవా
సాధారణంగా ప్లేస్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం రోజున ఏటీ కియర్నీ, బెయిన్ అండ్ కంపెనీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వంటివి కన్సల్టెంట్లను, డేటా సైంటిస్టులను నియమించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇవి ముఖ్యంగా కోడింగ్ నాలెడ్జ్, బిగ్ డేటా మేనేజ్మెంట్ నైపుణ్‌యం కలిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ డెవలపర్లు, ప్రాడక్ట్ ఇంజినీర్ల కోసం చూస్తాయి. దాదాపు అత్యధిక ప్రతిభ కలిగిన వారిగా భావించే వారిని సాధ్యమైనంత ఎక్కువ వేతనం ఇవ్వజూపి ఈ కంపెనీలు నియమించుకునే ప్రయత్నం చేస్తాయి.

5. ఫ్లిప్‌కార్ట్ సైతం
ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ ప్లేస్‌మెంట్ జాబితాలోని కంపెనీల్లో యాక్సిస్ బ్యాంకు, హెచ్ఎస్‌బీసీ సైతం నమోదు చేసుకున్నాయి. అక్టోబర్ 22న విద్యార్థులంతా మిడ్‌టర్మ్ బ్రేక్ తర్వాత తిరిగి క్యాంపస్‌కు వస్తే అప్పుడు ప్లేస్‌మెంట్ ప్రక్రియ జోరందుకుంటుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, దేశీయ ఈ-కామర్స్లో అతిపెద్ద కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సైతం రిక్రూటర్ల జాబితాలో ఉండే అవకాశం ఉందని విద్యార్థులు ధీమాగా చెబుతున్నారు.

6. మెషీన్ లెర్నింగ్ ఉద్యోగాలకై ఐబీఎమ్
గతేడాది కన్నా నియమాకాల ప్రక్రియలో జోరు బాగా ఉందని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి చెప్పారు. చాల సంస్థలు క్యాంపస్‌కు వస్తున్నాయి, పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ వాతావరణం గతేడాది కంటే బాగా ఉంది.చాలా మంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోకపోవడం వల్లే ఉద్యోగాలను కోల్పోతారని ఆ విద్యార్థి విశ్లేషించారు. మెషీన్ లెర్నింగ్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా తయారైంది. అంతే కాకుండా విద్యార్థుల్లో చాలా మంది వీఎల్ఎస్ఐ చిప్ డిజైన్ విషయంలో ఆసక్తిగా ఉన్నారు. ఇంకా కన్సల్టెన్సీ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేందుకు గాను కొంత మంది విద్యార్థులు ఎంబీఏ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్, మార్కెటింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. ఐబీఎం మెషీన్ లెర్నింగ్ సంబంధిత ఉద్యోగాలను చేసే వారి కోసం చూస్తోందని విద్యార్థి తెలిపారు.

7. అక్టోబర్ చివరికి 100కు పైగా కంపెనీలు
నియామకాల ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ అక్టోబర్ చివరికి 100 నుంచి 120 కంపెనీలు నియామకాల ప్రక్రియలో పాలు పంచుకుంటాయని మెకానికల్ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థి అన్నారు. ఇంకా చాలా స్టార్టప్‌లు రిజిస్టర్ చేసుకోలేదు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న రుబ్రిక్ ఈ తరహా జాబితాలో విద్యార్థుల చాయిస్‌లో ముందుంటుంది. జొమాటో, పోర్టియా మెడికల్, హోస్ప్‌స్కాచ్ వంటి కంపెనీలు గతేడాది మొదట ఆఫర్ లెటర్లు ఇచ్చి మళ్లీ విత్‌డ్రా చేసుకున్నాయన్న కారణంతో బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయి.

8. విద్యార్థుల సైతం చెక్ చేసుకోవాలి
అయితే ఈ నిషేధాన్ని స్టార్టప్‌లపై ఈ ఏడాది తొలగించారు. స్టార్టప్‌డే పేరుతో నియామకాల ప్ర్రక్రియ మొదటి రోజు స్టార్టప్‌లన్నీ పాలు పంచుకునే వీలుంది. విద్యార్థులు తమ ప్రాంగణ నియామకాల్లో ఎంపికల సమయంలో తమ సొంత మార్గాల ద్వారా ఆయా కంపెనీలు, ఆఫర్ల గురించి చెక్ చేసుకోవాల్సిందిగా యాజమాన్యం సూచిస్తోంది.

9. స్టార్టప్‌ల విషయంలో అది సానుకూలం
స్టార్టప్‌లపై నిషేధం ఎత్తివేసినప్పటికీ అది విద్యార్థులపై ఇతర సంవత్సరాలతో పోలిస్తే ప్రభావాన్ని చూపలేదని తుది సంవత్సర ఇంజినీరింగ్ విద్యార్థి చెప్పారు. ''స్టార్టప్‌ల విషయంలో మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే, నాన్-ఐటీ విద్యార్థులైనా సరే కోడింగ్ తెలిసి ఉంటే చాలు వారిని నియమించుకునేందుకు ముందుకు వస్తాయి. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ విషయంలో అలా జరగదు. కొన్నిసార్లు స్టార్టప్‌లు సైతం వ్యాపార విస్తరణకు సంబంధించిన ఉద్యోగాల్లో సైతం ఐఐటీ పట్టభద్రులను తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి'' అని ఆ విద్యార్థి వెల్లడించారు.

10. ఈ ఏడాది ఆ స్టార్టప్‌లకు శుభపరిణామం
ఏళ్ల క్రితం నెలకొల్పిన టెక్ దిగ్గజాలతో సమానంగా నియామకాల ప్రక్రియలో స్టార్టప్ కంపెనీలు సైతం పాలు పంచుకోవడం విద్యార్థులకు శుభపరిణామం. గతేడాది నియామకాల విషయంలో వెనక్కు తగ్గిన స్టార్టప్‌లు నిషేధం బారిన పడగా, ప్రస్తుతం ఐఐటీలు ఏడాది తర్వాత నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఐఐటీల విషయంలో ఉన్న ఒక విద్యార్థి-ఒక ఉద్యోగం నిబంధన ప్రకారం, ఒక విద్యార్థి మొదట జాబ్ ఆఫర్ సంపాదిస్తే, ఆ అభ్యర్థి మళ్లీ ఇంటర్వూలకు హాజరవకూడదు. ఇది విద్యార్థుల కంటే కంపెనీలకు లాభించేలాగా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications